SBI Credit Card: దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న క్రెడిట్ కార్డుల్లో ఎస్‌బీఐ కార్డు ఒకటి. అయితే, గత రెండు రోజులుగా ఎస్‌బీఐ కార్డు యూజర్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాల వేదికలుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాము క్రమం తప్పకుండా, గడువు తేదీకి ముందే పూర్తి బిల్లులు చెల్లించినా తమ అకౌంట్లలో ఓవర్ డ్యూ ఉన్నట్లు చూపిస్తోందని స్క్రీన్ షాట్లతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ టెక్నికల్ సమస్య వల్ల తమ భారీగా దెబ్బతింటోందని, 50-80 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిపోతోందని పేర్కొంటున్నారు. మీరు కూడా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగిస్తుంటే మీ అకౌంట్ ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. అసలు సమస్య ఏంటి? కానీ, ఎస్‌బీఐ కార్డ్ యాప్, నెట్ బ్యాంకింగులో చాలా మందికి ఎరుపు రంగులో ఓవర్ డ్యూ ట్యాగ్ కనిపిస్తోంది. ఒకేసారి వేలాది మంది వినియోగదారులు ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం, యాప్ ఓపెన్ చేయడంతో సర్వర్లు కూడా కాసేలు డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కార్డు యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టెక్నికల్ లోపం వల్ల తమ క్రెడిట్ స్కోరు ఒకేసారి 50- 80 పాయింట్ల మేర పడిపోయినట్లు వాపోతున్నారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. క్రెడిట్ స్కోర్ తగ్గడం వల్ల భవిష్యత్తులో రుణాలు, కొత్త కార్డులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. బిల్లు చెల్లించిన పత్రాలను జత చేస్తూ ఎస్‌బీఐ కార్డ్ నోడల్ ఆఫీసర్‌కు nodalofficer@sbicard.com కి ఇ- మెయిల్ చేయాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. తక్షణమే ఈ పొరపాటును క్రెడిట్ బ్యూరోలకు నివేదించేలా మెయిల్ రాయాలని పేర్కొంటున్నారు. అయితే, ఈ వ్యవహారంపై ఎస్‌బీఐ కార్డ్ యాజమాన్యం ప్రకటన చేసింది. 'అంతర్గత సిస్టమ్స్, బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్లే ఇలా జరిగింది. కొంత మంది యూజర్ల జులై బిల్లులపై తప్పుగా ఓవర్ డ్యూ ట్యాగ్ కనిపిస్తోంది. దీనిపై మా టెక్నికల్ టీమ్ ఇప్పటికే పని చేస్తోంది. త్వరలోనే సమస్య సర్దుకుంటుంది' అని పేర్కొంది.