జీతం పెరుగుతున్నా రూపాయి మిగలట్లేదా? మిడిల్ క్లాస్‌ను ముంచేస్తున్న అసలు సమస్య ఇదే!

Wait 5 sec.

: ప్రతి నెలా ఒకటో తేదీన అకౌంట్లో జీతం పడగానే సంతోషం కంటే, ఆ డబ్బును దేనికి సర్దాలో తెలియక వచ్చే తలనొప్పే మీకు ఎక్కువగా ఉందా? ఇంటి అద్దె, లోన్ ఈఎంఐలు, పిల్లల ఫీజులు, మెడికిల్ బిల్స్, పెరిగిన నిత్యావసరాల ధరలు ఇలా ఒకటా రెండా అన్నీ కలిసి ఒకటో తేదీనే దాడి చేస్తుంటాయి. గతంలో పొదుపు చేయడం చాలా సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు వందల కొద్దీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల గందరగోళం మధ్య ఏది ఎంచుకోవాలో తెలియక చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు నిపుణులు సూచిస్తున్న సింపుల్ గైడ్ చూద్దాం. ప్రస్తుత ఆర్థిక ఒత్తిడికి కేవలం ఖర్చులు మాత్రమే కారణం కాదు. మారుతున్న ఉద్యోగ మార్కెట్ కూడా ఒక పెద్ద కారణం. జాబ్ మార్కెట్ పతనం- గతంలో 11 శాతంగా ఉన్న వైట్ కాలర్ ఉద్యోగాల వృద్ధి రేటు ప్రస్తుతం కేవలం ఒక శాతానికిపైగా పడిపోయింది. ఏఐ భయం- ఆటోమేషన్, ఏఐ కారణంగా క్లరికల్, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు వేగంగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం ఐటీ, కస్టమర్ సర్వీస్ రంగాల్లో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. పెరుగుతున్న పోటీ- ప్రతి ఏటా 80 లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తుండటంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన పెరిగింది.Read Also: బడ్జెట్ మేనేజ్మెంట్ కోసం 50/30/20 రూల్ఆర్థిక స్థిరత్వం కోసం కష్టమైన వ్యూహాలు అవసరం లేదని, సింపుల్‌గా జీతాన్ని విభజించుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా అవసరాలు అంటే ఇంటి ఖర్చులు, ఈఎంఐ, కిరాణా, పిల్లల ఫీజులు, కరెంట్ బిల్స్, ఇన్సూరెన్స్ వంటి తప్పనిసరి ఖర్చులకు 50 శాతం జీతం కేటాయించాలని సూచిస్తున్నారు. కోరికలు అంటే షాపింగ్, సినిమాలు, రెస్టారెంట్లు, విహార యాత్రలు, విలాస ఖర్చులు వంటి వాటికి జీతంలో 30 శాతం కేటాయించాలని చెబుతున్నారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ (సిప్), ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎమర్జెన్సీ ఫండ్, భవిష్యత్తు పెట్టుబడుల కోసం 20 శాతం కేటాయించాలని అంటున్నారు. Read Also: ఆర్థిక భద్రతకు నిపుణులు చెబుతున్న సూత్రాలుమార్కెట్లో వందలాది మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, బాండ్లు ఉన్నాయి. పర్ఫెక్ట్ ఫండ్ కోసం రీసెర్చ్ చేస్తూ ఆలస్యం చేయకుండా, ఒక మంచి డైవర్సిఫైడ్ ఫండ్‌ను ఎంచుకొని వెంటనే ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించడం మేలు.ఉద్యోగ అనిశ్చితి పెరిగిన తరుణంలో మీ 6-12 నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా దాచుకోవాలి. మీ నెలవారీ ఈఎంఐలు (హోం లోన్, కార్ లోన్ అన్నీ కలిపి) మీ చేతికి వచ్చే జీతంలో 40 శాతం మించకుండా చూసుకోవాలి. క్రెడిట్ కార్డు బకాయిల్ని ముందే తీర్చాలి. లాభాల కోసం పరిగెత్తే ముందు భద్రత ముఖ్యం. కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా సొంతంగానే ఒక సమగ్ర హెల్త్ పాలసీ తీసుకోవాలి. మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు అధికంగా ఉండే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండాలి. ప్రతి నెలా పెట్టుబడి పెట్టేందుకు విల్ పవర్ మీద ఆధారపడకుండా, శాలరీ పడగానే మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లు ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. NPS, ELSS వంటి పన్ను ఆదా సాధనాల్ని తెలివిగా వాడుకోవాలి.