గుంటూరు: మహిళపై దాడి ఘటన.. సీఐపై ప్రభుత్వం చర్యలు..

Wait 5 sec.

ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం.. నగరపాలెం సీఐ సత్యనారాయణపై చర్యలు తీసుకుంది. నగరపాలెం సీఐ సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్‌ ఐజీ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయటంతో పాటుగా తదుపరి చర్యలు తీసుకోవడంలో సీఐ సత్యనారాయణ విఫలమైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సీఎం నారా ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరిపించారు. కేసు నమోదు మొదలుకుని, చర్యలు తీసుకోవడం వరకూ సీఐ సత్యనారాయణ నిర్లక్ష్యం ప్రదర్శించారని నిర్ధరించిన ఉన్నతాధికారులు.. వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..జూలై15వ తేదీ రాత్రి కృష్ణబాబుకాలనీకి చెందిన ఓ మహిళ.. మోటార్ ద్వారా తన ఇంటి ముందు ఉన్న కుళాయి నుంచి నీరు పడుతున్నారు. ఈ సమయంలో 21వ డివిజన్‌ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కుళాయి నుంచి నీరు పడుతున్న మహిళతో వాగ్వాదానికి దిగారు. ఆమెను తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వెంకటరమణమూర్తి సోదరి, ట్రాన్స్‌జెండర్‌ మాధవి ఆమెపై దాడి చేశారు. తనను వదిలేయాలంటూ మహిళ వేడుకుంటున్నా వినకుండా.. ఆమెను నడిరోడ్డుపైనే వివస్త్రను చేసి దాడి చేశారు. ఈ ఘటనపై బాధితురాలు జూలై 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు.సీఎం చంద్రబాబు సీరియస్.. వెంకటరమణమూర్తి సస్పెండ్..మరోవైపు గుంటూరు ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్న చంద్రబాబు.. ఇలాంటి వాటికి సమాజంలో తావులేదని అన్నారు. గుంటూరు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, కారణమైనవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్న చంద్రబాబు..నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న కార్యకర్తను టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు.తప్పుచేసిన వారు ఎవరైనా పక్షపాతం చూపబోమన్న చంద్రబాబు.. రాజకీయ పలుకుబడి, పార్టీతో సంబంధం ఉందని ఏ ఒక్కరికీ రక్షణ లభించదని స్పష్టం చేశారు.