YS Jagan: "నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడి.. బాబుగారూ.. ఇదేనా మీ సుపరిపాలన?"

Wait 5 sec.

చేసిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కి పాల్పడిన ఘటన మానవత్వానికి మచ్చ మాత్రమే కాదని.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమని జగన్ మండిపడ్డారు. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టారని.. చివరకు ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో బయటకు వస్తే.. ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటని విమర్శించారు.వీడియోలను కప్పిపుచ్చే దానిపై చూపించిన శ్రద్ధ.. బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడే చూపించి ఉంటే.. ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. బాధిత మహిళ ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా అని జగన్ ప్రశ్నించారు." ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్‌?" అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహిస్తోందని జగన్ ఆరోపించారు. ఆ అరాచకాలను కప్పిపుచ్చేందుకు పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని.. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చుకుని ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులు, అక్రమ కేసులకు సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చారని ఆరోపించారు.తాము ఏం చేసినా పోలీసులు రక్షిస్తారనే ధైర్యం అధికార పార్టీ నేతలలో కనిపిస్తోందన్న వైఎస్ జగన్.. ఆ కారణంతోనే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారని ఆరోపించారు. మహిళలపై దాడి చేసినా, అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను చంద్రబాబు కాపాడుతారనే ధైర్యం వారిలో పెరిగిపోయిందన్నారు.ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందన్న జగన్.. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసిందన్నారు. చంద్రబాబుగారూ.. ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్‌? అని ప్రశ్నించారు. మహిళల ఆగ్రహమే టీడీపీ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుందంటూ జగన్ ట్వీట్ చేశారు.