జూన్ 12న ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. టైటిల్ ఫేవరెట్ జట్ల మధ్య ఆదివారం టైటిల్ పోరు జరగనుంది. ప్రముఖ క్రికెట్ స్టేడియం లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆరుసార్లు మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించగా, ఇంగ్లాండ్ ఒకసారి విజేతగా నిలిచింది.మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఆస్ట్రేలియా గ్రూప్-ఏ, ఇంగ్లాండ్ గ్రూప్-బిలో ఉన్నాయి. రెండు జట్లూ కూడిన ఆడిన అన్ని మ్యాచులలో గెలిచి సెమీస్ చేరాయి. అక్కడ కూడా ఘన విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టాయి. దీంతో రెండు జట్లూ అజేయంగా ఫైనల్ చేరాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఆరుసార్లు విజేతగా నిలిచింది. 2010, 2012, 2014, 2018, 2020, 2023లో టైటిల్ సాధించింది. మరోవైపు ఇంగ్లాండ్.. 2009లో ఛాంపియన్‌గా అవతరించింది. కాగా 2012, 2014, 2018 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా జట్టు.. ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఇప్పుడు సొంతగడ్డపై కంగారూలను ఓడించి.. రెండో మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది.తుది జట్లు అంచనా..ఆస్ట్రేలియా: బెత్ మూనీ, జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎలీస్ పెర్రీ/గ్రేస్ హారిస్, యాష్ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, అన్నబెల్ సదర్లాండ్, నికోలా కేరీ, సోఫీ మోలినెక్స్ (కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్ఇంగ్లాండ్: డాని వ్యాట్-హాడ్జ్, అమీ జోన్స్, నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), ఆలిస్ క్యాప్సీ, హీథర్ నైట్, ఫ్రేయా కెంప్, డానియెల్ గిబ్సన్, సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్, లారెన్ బెల్, లిన్సీ స్మిత్