వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Wait 5 sec.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంగా మారడంతో తెలంగాణ వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. ఈ వాయుగుండం ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో, చాంద్‌బలి, దిఘాలకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం, చురుగ్గా కదులుతున్న రుతుపవనాల కారణంగా తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటే.. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా ఉత్తర, ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా నేడు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ శాఖ గట్టిగా సూచించింది. నిరంతర వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తక్కువగా నమోదవుతాయని, దీనివల్ల ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.మరోవైపు, హైదరాబాద్ దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో సోమవారం వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది. గత కొన్ని రోజులుగా నగరంలో సాధారణ స్థితిలో నమోదవుతున్న వర్షపాతం, ఈ వారం మరింత పుంజుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోమవారం రోజంతా నగరంలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. పగటిపూట తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా జల్లులు పడే అవకాశం 45 శాతం వరకు ఉందని, రాత్రి వేళల్లో ఈ అవకాశం 10 శాతానికి తగ్గుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుంచి గంటకు 18 మైళ్ల వేగంతో చల్లటి గాలులు వీస్తుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.