లక్షాధికారుల్ని చేసే ఎస్బీఐ స్కీమ్.. ఒకేసారి లక్ష రావాలంటే నెలకు ఎవరు, ఎన్నేళ్లకు, ఎంత ఇన్వెస్ట్ చేయాలి?

Wait 5 sec.

: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గురించి తెలిసే ఉంటుంది. నిర్ణీత మొత్తం జమ చేస్తే నిర్ణీత కాల పరిమితి తర్వాత ఇక్కడ మీకు వడ్డీతో కలిపి డబ్బులు వస్తాయి. ఇంకా బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంటుంది. ఇందులో నెలనెలా నిర్దిష్ట మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ పోతే నిర్ణీత కాల వ్యవధికి మొత్తం డబ్బులు వస్తాయి. కానీ వీటికి భిన్నంగా కొంత కాలం కిందట ఎస్బీఐ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అదే . ఇక్కడ మీరు చేసే చిన్న చిన్న డిపాజిట్లతోనే లక్షాధికారులు కావొచ్చు. అంటే కచ్చితంగా ఇంతే జమ చేయాలని ఏం ఉండదు. మీరు రూ. 1 లక్ష పొందాలంటే దానికి తగ్గట్లుగా ఎన్నేళ్లకు ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మీరు ముందుగానే నిర్ణయించుకోవచ్చు.ఇక్కడ కూడా వేర్వేరు కాల పరిమితులు ఉంటాయి. వడ్డీ రేట్లు కూడా సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజెన్లకు వేర్వేరుగా ఉంటాయి. అంటే మూడేళ్లలో మీరు రూ. 1 లక్ష రావాలంటే నెలకు ఎంత జమ చేస్తూ పోవాలి.. అదే ఐదేళ్లలో లక్ష పొందాలంటే ఎంత డిపాజిట్ చేయాలి. ఇలా నిర్ణయించుకోవచ్చు. ఇలా రూ. 1 లక్ష అనే కాదు రూ. 2, 3 లక్షలు, 5 లక్షలు ఇలా ఎంత కావాలంటే దానికి తగ్గట్లుగా నెలనెలా డిపాజిట్లు చేసుకోవచ్చు. సిప్ మాదిరిగానే ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. కానీ గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. వడ్డీ రేట్ల గురించి ముందుగా తెలుసుకోవాలి. సాధారణ ప్రజలకు 3, 4 ఏళ్ల వ్యవధికి 6.55 శాతంగా ఉంటే, 5- 10 ఏళ్ల మధ్య దేనికైనా 6.30 శాతంగా వడ్డీ రేటు ఉంది. సీనియర్ సిటిజెన్లకు చూస్తే వరుసగా ఇక్కడ 7.05 శాతం, 6.80 శాతం చొప్పున వడ్డీ అందుతుంది. ఒకేసారి చేతికి రూ. 1 లక్ష- నెలకు ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి?కాబట్టి ఇక్కడ సాధారణ ప్రజలు మూడేళ్లలో రూ. 1 లక్ష పొందాలంటే 6.55 శాతం వడ్డీ రేటు చొప్పున నెలకు రూ. 2510 చొప్పున మూడేళ్ల పాటు జమ చేస్తూ పోవాల్సి ఉంటుంది. ఇక్కడ సీనియర్ సిటిజెన్లకు రూ. 2500 చొప్పున పడుతుంది. అదే నాలుగేళ్లలో చూస్తే సాధారణ ప్రజలు నెలకు రూ. 1820, సీనియర్ సిటిజెన్లుక రూ. 1810 చొప్పున డిపాజిట్ చేయాలి. ఐదేళ్లలో లక్ష కావాలంటే సాధారణ ప్రజలు నెలకు రూ. 1420, సీనియర్ సిటిజెన్లు రూ. 1410 చొప్పున డిపాజిట్లు చేయాలి. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో రూ. 1 లక్ష కార్పస్ కోసమే లెక్కలు ఇచ్చినా.. మీరు ఆపైన ఎన్ని లక్షలు నిధి సమకూర్చాలన్నా దానికి తగ్గట్లుగా నెలకు ఎంత జమ చేయాలనేది బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవచ్చు. హర్ ఘర్ లఖ్‌పతి స్కీమ్ వివరాలుస్కీమ్ ఇతర వివరాల్ని చూస్తే భారతీయ నివాసితులు ఎవరైనా ఈ స్కీమ్ కింద అకౌంట్‌ను సింగిల్‌గా లేదా జాయింట్‌గా తెరవొచ్చు. మైనర్ల పేరిట గార్డియెన్స్ ఖాతా తెరవొచ్చు. కనీసం 3 ఏళ్ల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు డిపాజిట్లు చేయొచ్చు. వరుసగా 6 ఇన్‌స్టాల్‌మెంట్స్ డబ్బులు కట్టకపోతే ముందస్తుగానే అకౌంట్ క్లోజ్ అవుతుంది. అప్పటివరకు ఉన్న బ్యాలెన్స్ మాత్రమే ఖాతాదారునికి చేరుతుంది.