అంబానీ 'రిలయన్స్'= టీసీఎస్ + ఇన్ఫోసిస్ + విప్రో + హెచ్‌సీఎల్ + టెక్ మహీంద్రా.. రూ.17.65 లక్షల కోట్లు

Wait 5 sec.

Reliance Market Value: దేశంలోని 5 దిగ్గజ టెక్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ.. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మార్కెట్ విలువకు దాదాపు సమాన స్థాయిగా ఉంది. ఇటీవలి కొన్ని నెలలుగా దేశీయ ఐటీ కంపెనీల షేర్లు భారీగా పడిపోతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 17.65 లక్షల కోట్లుగా ఉంది. ఇక దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 18.12 లక్షల కోట్లుగా ఉంది. ల మొత్తం మార్కెట్ విలువ రూ. 17.50 లక్షల కోట్లే. ఈరోజు ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 17.51 లక్షల కోట్ల కంటే ఇది కాస్త తక్కువే. గత రెండు దశాబ్దాల్లో అగ్రగామి 5 కలిపినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే తక్కువగా నమోదవడం ఇప్పుడే. 2024 నుంచి తగ్గిన విలువప్రస్తుతం ఆ స్థాయి నుంచి 16.7 శాతం తగ్గి రూ. 17.65 లక్షల కోట్లకు దిగివచ్చింది. అలాగే 5 దిగ్గజ ఐటీ కంపెనీల మార్కెట్ విలువ రూ. 33.71 లక్షల కోట్ల నుంచి 46.20 శాతం మేర ఆవిరైంది. రూ.18.12 లక్షల కోట్లకు పరిమితమైంది. 2026లో ఇప్పటి వరకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ షేర్లు 36 శాతం వరకు పడిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ సేవలకు గిరాకీ తగ్గుతుందనే భయాలు, అంతర్జాతీయంగా బలహీన గిరాకీ పరిస్థితుల వంటివి సంప్రదాయ ఐటీ కంపెనీల షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఐటీ కంపెనీల షేర్లు తగ్గడంతో మార్కెట్ విలువ పడిపోతోంది.రిప్రస్తుత మార్కెట్ విలువ రూ. లక్షల కోట్లలోరిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.65 లక్షల కోట్లుటీసీఎస్ రూ. 7.57 లక్షల కోట్లుఇన్పోసిస్ రూ. 4.24 లక్షల కోట్లుహెచ్‌సీఎల్ టెక్ రూ. 3.09 లక్షల కోట్లువిప్రో రూ. 1.84 లక్షల కోట్లుటెక్ మహీంద్రా రూ. 1.38 లక్షల కోట్లు