Layoffs ఉద్యోగులకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. 4,800మంది తొలగింపు

Wait 5 sec.

టెక్‌ దిగ్గజం ప్రకటించింది. తమ సంస్థలో 4,800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థ ఉద్యోగుల్లో ఇది 2.1 శాతం కావడం గమనార్హం. కృత్రిమ మేధ పెట్టుబడులు, వ్యయాలను తగ్గించుకోవడం మరింతగా దృష్టి సారిస్తుండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెజాన్, మెటా వంటి దిగ్గజాలు కూడా ఈ ఏడాది వేలాది మంది ఉద్యోగులను సాగనంపాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాల AI పెట్టుబడులు ఈ ఏడాది 700 బిలియన్ డాలర్ల దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉంటాయని రెండు నెలల కిందట మైక్రోసాఫ్ట్‌ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా, . సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చే విభాగాలపై తాము మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ అమీ కోల్‌మన్‌ పేర్కొన్నారు. ఈ భారీ కోతల వల్ల ఒక్క ఎక్స్‌బాక్స్‌లోనే 1600కిపైగా ఉద్యోగులను తొలగిస్తామని సీఈఓ ఆశా శర్మ ఉద్యోగులకు పంపిన మెయిల్ వివరించారు. ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో,1,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు, మిగిలిన వారిని 2027 ఆర్థిక సంవత్సరంలో తొలగిస్తారని శర్మ పేర్కొన్నారు. దీనికి అదనంగా, తన నాలుగు గేమింగ్ స్టూడియోలను విక్రయించనుంది. మరొక దానితో కూడా సంబంధాలు తెంచుకోవడానికి సిద్ధమవుతోంది.ఏఐ (AI) మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తూ, తన వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోడానికి ఈ సాంకేతికతను ఉపయోగిస్తోంది. దీంతో టెక్ రంగంలో జరుగుతున్న లేఆఫ్‌ల పరంపరలో ఇది తాజాది. 2026 మొదటి ఆరు నెలల్లో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 23 శాతం పడిపోయి నేపథ్యంలో సోమవారం లేఆఫ్‌ల ప్రకటన వెలువడింది. 2022 తర్వాత మైక్రోసాఫ్ట్ షేర్లు తొలి అర్థభాగంలో దారుణమైన పతనాన్ని చవిచూడటం ఇదే మొదటిసారి.ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలోని తన ఉద్యోగులలో సుమారు 7 శాతం మంది అంటే దాదాపు 9,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వాలంటరీ బైఅవుట్స్) మైక్రోసాఫ్ట్ అందించింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఖర్చు ప్రణాళికలను నిర్దేశించుకునే క్రమంలో జూన్‌లో తన ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఉద్యోగాలను తగ్గిస్తుంది.ఏఐకి పెరుగుతోన్న విపరీతమైన డిమాండ్ కారణంగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. గతేడాది ఏప్రిల్ వరకు OpenAI మోడళ్లను విక్రయించే ప్రత్యేక హక్కులు అజూర్‌కే ఉన్నాయి. ఆ సేవల నిర్వహణకు డేటా సెంటర్లను నిర్మించడంలో ఖర్చు నానాటికీ పెరుగుతుండటంతో మైక్రోసాఫ్ట్ నగదు ప్రవాహంపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తోంది.ఈ నెల చివరలో అర్థ సంవత్సర ఫలితాలను ప్రకటించనున్న మైక్రోసాఫ్ట్.. గత ఏప్రిల్‌లోనే అజూర్ త్రైమాసిక విక్రయాలు వాల్ స్ట్రీట్ అంచనాల కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా వేసింది. కానీ అదే సమయంలో 2026 ఏడాదికిగానూ ఏకంగా 190 బిలియన్ డాలర్లు (రూ. 15 లక్షల కోట్లకు పైగా) భారీ వ్యయ అంచనాను ప్రకటించి మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భారీ వ్యయం విశ్లేషకుల అంచనాలను పూర్తిగా దాటేసింది.