ముగ్గురు, ఆపైన పిల్లలు ఉన్నవారికి రూ.5000.. ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు..

Wait 5 sec.

.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమైంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న దంపతులకు 5 వేల రూపాయలు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లా నుంచి మూడు జంటలకు ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు. అలాగే కాన్పుల మధ్య రెండు సంవత్సరాలు విరామం పాటించిన వారికి రూ.5 వేల ప్రోత్సాహకం అందించనున్నారు. ఈ ప్రోత్సాహకాలపై ప్రచార కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.56 లక్షలు విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తం చేస్తున్నారు. యువశక్తి తగ్గటంతో పాటుగా వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతుండటంతో.. భవిష్యత్తులో యువ శ్రామికశక్తి కొరత ఏర్పడవచ్చనే ఆందోళన నెలకొంది. దేశంలో సగటు టీఎఫ్ఆర్ (Total Fertility Rate) 2.1గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఇది 1.5కు పడిపోయింది. వృద్ధుల సంఖ్య జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో యువ శ్రామికశక్తి కొరత ఏర్పడకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జనాభా పెంపును ప్రోత్సహిస్తోంది. ఈ కారణాలతోనే గతంలో కుటుంబ నియంత్రణకు పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిస్తున్నారు. ఇస్తామంటూ ఇటీవల చంద్రబాబు ప్రకటించడం పెద్దఎత్తున చర్చకు కారణమైంది. మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా కొంతమంది దంపతులు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. మొదటి బిడ్డ మగ పిల్లాడు కాకపోతేనే రెండో బిడ్డ వైపు మొగ్గు చూపుతున్నారని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఫలితంగా కుటుంబాల పరిమాణం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.టోటల్ ఫర్టిలిటీ రేట్ (టీఎఫ్ఆర్) 2.1గా ఉన్నప్పుడే జనాభా స్థిరంగా ఉంటుందన్న చంద్రబాబు.. తగ్గుతున్న జనాభా, పెరుగుతున్న వృద్ధుల సంఖ్య అనేక దేశాల ఆర్థిక వృద్ధిని దెబ్బతీశాయని హెచ్చరించారు. పిల్లలు భారం కాదని.. వారే ఆస్తి అని చంద్రబాబు పిలుపునిస్తున్నారు.