కేరళలో షాకింగ్ ఘటన.. 13 ఏళ్ల బాలికపై తోటి విద్యార్థులే వాష్‌రూమ్ దగ్గర దారుణం!

Wait 5 sec.

కేరళలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికపై తోటి విద్యార్థులే వేధించారని ఆరోపణలు ఇప్పుడు అక్కడ కలకలంగా మారాయి. ఈ ఘటనపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా సుమోటోగా కేసు నమోదు చేసింది. పోలీసుల వివరాల మేరకు.. ఈ ఏడాది మే నెలలో తనపై వేధింపులు జరిగినట్లు బాలిక ఆరోపించింది. పాఠశాల ప్రాంగణం, తన తోటి విద్యార్థిని ఇంటి వద్ద, అలాగే పాఠశాల వాష్‌‌రూమ్‌లో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు చేసింది. ఈ కేసులో ఒక బాలికతో పాటు మొత్తం పది మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఆరుగురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలలో రీ ఓపెన్ అయిన సందర్భంగా కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు. ఇందులో బాధిత విద్యార్థిని తనపై జరిగిన వేధింపుల గురించి వెల్లడించింది. దీంతో పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని చైల్డ్ లైన్ అధికారులకు తెలియజేసింది. అనంతరం చైల్డ్ లైన్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు వెలుగులోకి వవచ్చింది. బాలిక వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. READ ALSO బాధితురాలి వివరాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం ఇతర సాక్షుల వాంగ్మూలాలు కూడా సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే దాదాపు ఏడాదిన్నర కిందట ఇదే ప్రాంతంలో నమోదైన మరో కేసుతో ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటనపై తొలుత మీడియాలో కథనాలు రావడంతో కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఘటనపై పూర్తి నివేదికతో పాటు దర్యాప్తు పురోగతిపై వివరాలను పోలీసు కమిషనర్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. పాఠశాలలో నిర్వహించే కౌన్సెలింగ్, బాలల రక్షణ వ్యవస్థలు ఎంత కీలకంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. దర్యాప్తు దశలో ఉన్న ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలోనే అందించనున్నారు.