: దీర్ఘాకాలిక ఆర్థిక ప్లానింగ్ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని () టాప్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ పథకాన్ని కేంద్రం 1986లో ప్రారంభించింది. తక్కువ రిస్క్, ప్రభుత్వ హామీ గల పొదుపు పథకం. స్థిరమైన, గ్యారెంటీ రిటర్న్స్ ఇస్తుంది. వాటి కోసం దీర్ఘకాలం పాటు పొదుపు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ పథకంగా చెప్పవచ్చు. అయితే 10 ఏళ్ల వయసు ఉన్న పాప పేరుతో అకౌంట్ తెరిచి నెలకు రూ.5 వేల చొప్పున జమ చేస్తే ఎంతొస్తుందో ఇప్పుడే తెలుసుకుందాం. పీపీఎఫ్ అకౌంట్‌ను పోస్టాఫీసు లేదా బ్యాంకుల్లో చాలా సులభంగా తెరవవచ్చు. అప్లికేషన్ ఫారం, ఫోటో, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించి అకౌంట్ తీసుకోవచ్చు. చిన్న పిల్లల పేరుపై ఖాతా తెరిచినప్పుడు తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుడి పేరుతో అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వారి పేరుపైనే అకౌంట్ బదిలీ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో పిల్లల పేరుపై పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసేందుకు సరైన మార్గం. నెలకు రూ.5000 జమ చేస్తే ఎంతొస్తుంది?. ఆ తర్వాత 5 సంవత్సరాల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లవచ్చు. ప్రస్తుతం ఇందులో 7.1 శాతం వడ్డీ వస్తుంది. 10 ఏళ్ల వయసు పాప పేరుతో ఇందులో నెలకు రూ.5 వేలు జమ చేస్తూ వెళ్లినట్లయిదే 15 ఏళ్లలో చేతికి రూ. 16,27,000 వరకు వస్తాయి. అంటే అమ్మాయికి 25 ఏళ్ల వయసు వచ్చాక ఒకేసారి రూ.16 లక్షలు చేతికి అందుతాయి. ఇవి ఆమె పెళ్లి, ఉన్నత చదువులకు ఎంతగానో ఉపయోగపడతాయి. 15 ఏళ్లు కాకుండా 5 సంవత్సరాల చొప్పున రెండుసార్లు పొడిగించారు అనుకుందాం. అంటే 25 సంవత్సరాలు పొదుపు చేసుకుంటూ వెళ్లారు అనుకుంటే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 41 లక్షల వరకు వస్తాయి. అంటే మీ అమ్మాయికి 35 ఏళ్ల వయసు వచ్చే వరకు పొదుపు చేస్తే రూ.41 లక్షలు అందుతాయి. మీ పెట్టుబడి రూ.15 లక్షలు మాత్రమే దానిపై రూ.26 లక్షల వరకు వడ్డీనే వస్తుంది. ఆపైన మరో 15 ఏళ్లు పొడిగించారు అనుకుందాం. అంటే మీ పాపకు 50 సంవత్సరాలు వచ్చే వరకు ఇందులో నెలకు రూ.5 వేల చొప్పున పొదుపు చేసుకుంటూ వెళ్లారు అనుకుందాం. అప్పుడు ఒకేసారి చేతికి రూ. 1.31 కోట్లకు పైగా వస్తాయి. మీ పెట్టుబడి కేవలం రూ.24 లక్షలే ఉంటుంది. దానిపై ఏకంగా రూ.1.07 కోట్ల వడ్డీ వస్తుంది. ఈ మొత్తానికి ఎలాంటి పన్నులు ఉండవు. పూర్తిగా మీ చేతికి వస్తుంది.