సంజూ శాంసన్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సెలక్టర్లు.. జట్టు నుంచి ఔట్..!

Wait 5 sec.

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా పేలవఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అతడికి జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కలేదు. సెలెక్టర్లు ఈ పర్యటన కోసం 15 మంది సభ్యుల జట్టును సోమవారం (జులై 6, 2026) ప్రకటించారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, అతడికి డిప్యూటీగా తిలక్ వర్మ ఎంపికయ్యారు.ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ కూడా సీనియర్ భారత జట్టు నుంచి తొలిసారి పిలుపు అందుకున్నాడు. ఐపీఎల్‌ సహా, దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన ఈ పేసర్‌కు భారత జట్టు నుంచి పిలుపు అందింది. ఈ పేసర్ ఇంతకుముందు శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్‌లో ఇండియా ఏ తరఫున ఆడాడు...ఇటీవలి ఆడిన మూడు మ్యాచ్‌లలో రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లలో విఫలమైన అతడు.. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఏడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. టీమిండియా టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నప్పటికీ.. ఇటీవల ఫామ్ ఆదారంగా అతడిపై వేటు వేశారు. కాగా సంజూ శాంసన్‌ ఐపీఎల్ 2026కు ముందు జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి, టీమిండియా టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించడం గమనార్హం. మయాంక్ యాదవ్, రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. జులై 23, 25, 26 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.జింబాబ్వే పర్యటనకు భారత టీ20 జట్టు..శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), శివమ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్‌)