జాతుల మధ్య వైరంతో అట్టుడికి.. ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఉఖరుల్ జిల్లాలో 40 అస్సాం రైఫిల్స్‌కు చెందిన సైనిక కాన్వాయ్‌ను ఐఈడీతో సాయంతో పేల్చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. జిల్లా కేంద్రం ఉఖరుల్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారి 202పై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో వారెంట్ ఆఫీసర్ బల్వంత్ సింగ్, రైఫిల్‌మ్యాన్ సీఎం సింగ్‌‌ అమరులైనట్టు అధికారులు తెలిపారు. 40 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి అనంతరం భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ముష్కరుల కోసం చుట్టుపక్కల గాలింపు ప్రారంభించాయి.ఈ దాడి తర్వాత చాలా గంటల పాటు భారీ కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఇది భద్రతా దళాలకు, తిరుగుబాటుదారులకు మధ్య సుదీర్ఘ కాల్పుల పోరాటం జరిగినట్లు సూచిస్తోంది. ఉగ్రవాదుల క్రూరమైన చర్యలను తీవ్రంగా ఖండించిన .. అమరులైన జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించదని, బాధ్యులను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించేలా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు.మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సమాజంలో ఇటువంటి హింసకు స్థానం లేదని, శాంతిభద్రతలను కాపాడాలనే సామూహిక సంకల్పాన్ని ఇవి బలహీనపరచలేవని గవర్నర్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలిపిన ఆయన.. వారికి మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారుకాన్వాయ్‌పై దాడిని మణిపూర్ హోం మంత్రి గోవిందాస్ కొంతౌజం ఖండించారు. ఇలాంటి దాడులు మనమంతా ఆకాంక్షించే శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తాయి... ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఆయన అన్నారు.బాధ్యులను న్యాయస్థానం ముందు నిలబెడతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనకు కారకులైనవారిపై భద్రతా దళాలు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాయని నేను విశ్వసిస్తున్నాను.. మణిపూర్ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మనందరి సమిష్టిగా ఐక్యంగా ఉందాం’’ అని ఆయన అన్నారు. భద్రతా దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని, ఆ ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం కూడా చేరుకుని ఆధారాలు సేకరిస్తోందని అధికారులు తెలిపారు.