: మ్యూచువల్ ఫండ్ రంగంలో సరికొత్త పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఫండ్ హౌస్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ (Axis Mutual Fund) సరికొత్త ఇండెక్స్ ఫండ్‌ను లాంచ్ చేసింది. తమ పోర్ట్ ఫోలియోలోని ఖాళీలను పూరిస్తూ, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా () పేరుతో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మరి ఈ సరికొత్త ఇండెక్స్ ఫండ్ గురించిన వివరాలు తెలుసుకుందాం. యాక్సిస్ నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ అనేది ట్రాకింగ్ ఎర్రర్‌లకు లోబడి, వ్యయాలకు ముందు స్థాయిలో నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ టీఆర్ఐకి అనుగుణమైన రాబడులను అందించడమే లక్ష్యంగా పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫండ్ నిబంధనలకు లోబడి పని చేస్తుందని, ఇండెక్స్‌లోని మొత్తం 50 స్టాక్స్‌లో సమానంగా పెట్టుబడి పెడుతుందని తెలిపింది. ఈ కేటాయింపును స్థిరంగా కొనసాగించడం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి పోర్ట్ ఫోలియోను రీబ్యాలెన్స్ చేస్తుందని పేర్కొంది. దీంతో మార్కెట్ హెచ్చు తగ్గుల కారణంగా పెట్టుబడులు కేవంల కొన్ని కంపెనీల వైపు మొగ్గు చూపకుండా ప్రతి స్టాక్ పై ఎప్పుడూ సమానమైన పట్టు ఉండేలా చూస్తుందని తెలిపింది. క్రమబద్ధమైన, పారదర్శకమైన విధానం వల్ల ఎలాంటి వ్యక్తిగత అంచనాలకు తావుండదని పేర్కొంది. ఇదీ చదవండి: ఈక్వల్ వెయిట్ వ్యూహాలపై పెట్టుబడిదారులలో ఆసక్తి వేగంగా పెరుగుతున్న తరుణంలో ఈ ఫండ్ అందుబాటులోకి వచ్చింది. వివిధ ఈక్వల్ వెయిట్ ఆధారిత పాసివ్ స్కీమ్‌ల ఆస్తుల నిర్వహణ 2019-20లో దాదాపు రూ.100 కోట్లుగా ఉండగా అది 2025-26కు వచ్చే సరికి రూ.10 వేల కోట్లకు చేరుకుంది. సాధారణ నిఫ్టీ 50 ఫండ్లలో పెద్ద కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కానీ, నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ మాత్రం ఇండెక్స్‌లోని ప్రతి కంపెనీకి సమానమైన వెయిటేజీ ఇస్తుంది. దీంతో మొత్తం 50 కంపెనీలలో పెట్టుబడులు సమతుల్యంగా పంపిణీ అవుతాయి. కేవలం పెద్ద స్టాక్స్ పైనే ఆధారపడే ప్రమాదం తగ్గుతుంది. పెట్టుబడిదారులకు నిప్టీ 50 ప్రపంచంలో భాగస్వామ్యం అయ్యేందుకు వినూత్న మార్గాన్ని సూచిస్తుంది. ఈ ఫండ్‌ను నందిక్ మల్లిక్, రోహిత్ గౌతమ్ నిర్వహిస్తారని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. న్యూ ఫండ్ ఆఫర్ (NFO) వ్యవధిలోనే కాకుండా ఆ తర్వాత సైతం ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.100గా ఉంటుందని పేర్కొంది. ఆపైన రూ.1 గుణిజాల్లో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చని తెలిపింది. ఒక ప్రత్యేకమైన ఈక్వల్ వెయిటేడ్ వ్యూహం ద్వారా నిఫ్టీ 50 ఇండెక్స్ లోని భారత దేశ అగ్రగామి బ్లూ-చిప్ కంపెనీల వైవిధ్యభరితమైన పోర్ట్ ఫోలియోలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఇన్వెస్టర్లకు కల్పిస్తోంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ 2026, జులై 3వ తేదీనే మొదలైంది. జులై 17, 2026 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత యూనిటల్ కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత క్రయ విక్రయాలకు రిటైల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది.