: పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కీలక రంగాల్లోని స్టాక్స్ భారీగా నష్టపోయాయి. విదేశీ మదుపరులు కీలక రంగాల్లో భారీగా అమ్మకాలు చేపట్టారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనూ 13 పెన్నీ స్టాక్స్ అదిరిపోయే రిటర్న్స్ అందించాయి. గరిష్ఠంగా 260 శాతం వరకు రాబడులు ఇచ్చాయి. ఇందులో రెండు మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా నిలిచాయి. ఈ స్టాక్స్‌ను పలు ప్రత్యేక ఫిల్టర్లను ఉపయోగించి జాబితా తయారు చేయడం జరిగింది. షేర్ విలువ రూ.20లోపే ఉండి, కనీస ట్రేడ్ విలువ 5 లక్షల షేర్లుగా ఉన్నవాటిని ఎంచుకోవడం జరిగింది. పెన్నీ స్టాక్స్ సాధారణంగా ఎప్పుడూ తక్కువ ధరతో అధిక రిటర్న్స్ ఇచ్చే సామర్థ్యంతో ఉండడంతో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటాయి. అయితే, ఇందులో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. హెచ్చుతగ్గులు చాలా వేగంగా జరుగుతాయి. ఈ పెన్నీ స్టాక్స్ ద్వారా మంచి లాభాలు అందుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు అదృష్టాన్ని మించిన నైపుణ్యం ఉండాలి. ఇందులో క్రమశిక్షణ, పరిశోధన, రిస్క్ మేనేజ్మెంట్‌పై సరైన పట్టు ఉండడం చాలా అవసరం. హైరిటర్న్స్ ృటఎవెక్సియా లైఫ్‌కేర్ (Evexia Lifecare) కంపెనీ స్టాక్ గత 3 నెలల్లోనే 261 శాతం లాభాన్ని అందించింది. లక్ష రూపాయల పెట్టుబడిన రూ.3.61 లక్షలు అందించింది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.1.77 మాత్రమే. విజి ఫైనాన్స్ (Viji Finance) షేరు గత 3 నెలల్లో 127 శాతం మేర లాభాలు ఇచ్చింది. లక్ష రూపాయలను రూ.2.27 లక్షలు అందించింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.7 వద్ద ట్రేడవుతోంది. ఎంపవర్ ఇండియా (Empower India) కంపెనీ స్టాక్ గత 3 నెలల్లో 96 శాతం లాభాన్ని ఇచ్చింది. లక్ష రూపాయలను రూ.1.96 లక్షలు చేసింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.2.21 వద్ద ఉంది. సాధన నైట్రో కెమ్ కంపెనీ స్టాక్ గత 3 నెలల్లో 91 శాతం లాభాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 2.89 వద్ద ఉంది. దనుబ్ ఇండస్ట్రీస్ (Danube Industries) కంపెనీ స్టాక్ గత 3 నెలల్లో 75 శాతం లాభాలు ఇచ్చింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.7.19 వద్ద ఉంది ఓంటిక్ ఫిన్‌సర్వ్ (Ontic Finserve) కంపెనీ స్టాక్ మూడు నెలల్లో 59 శాతం లాభాలు ఇచ్చింది. ఈ స్టాక్ ధర రూ.2.19 వద్ద ఉంది. హోమ్రో (Homre) కంపెనీ స్టాక్ మూడు నెలల్లో 58 శాతం లాభాలు ఇచ్చింది. ఈ స్టాక్ ధర రూ.2.12 వద్ద ఉంది. శ్రేష్ఠ ఫిన్‌నెస్ట్ (Srestha Finvest) కంపెనీ స్టాక్ 3 నెల్లలో 55 శాతం లాభపడింది. ప్రస్తుతం రూ. 0.34 ధర వద్ద ట్రేడవుతోంది. స్పెక్ట్రమ్ ఫుడ్స్ (Spectrum Foods) కంపెనీ స్టాక్ 3 నెలల్లో 46 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.18.18 వద్ద ఉంది. కన్సూక్యూటివ్ కమోడిటీస్ కంపెనీ స్టాక్ 3 నెల్లలో 40 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.1.01 వద్ద ఉంది. ఎన్‌హెచ్‌సీ ఫుడ్స్ (NHC Foods) కంపెనీ స్టాక్ 3 నెలల్లో 4 శాతం లాభపడింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.1.09 వద్ద ఉంది. అన్లోన్ హెల్త్‌కేర్ కంపెనీ స్టాక్ సైతం 40 శాతం లాభాలు ఇచ్చింది. ఈ స్టాక్ ధర రూ.15.86 వద్ద ఉంది. తిలక్ వెంచర్స్ లిమిటెడ్ స్టాక్ 3 నెలల్లో 36 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.1.21 వద్ద ఉంది.