హమ్మయ్యా.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు.. జులై 5న తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే?

Wait 5 sec.

Gold Price Fall: భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. తమ సామర్థ్యానికి తగినట్లుగా వీలైనప్పుడల్లా కొనుగోలు చేస్తుంటారు. తమ వద్ద ఎంత బంగారం ఉంటే అంత గౌరవంగా, ఆర్థిక భరోసాగా భావిస్తారు. ఇటీవలి కాలంలో పెట్టుబడి సాధనంగానూ బంగారాన్ని ఎంచుకుంటున్నారు. అయితే, గత ఏడాది కాలంలో బంగారం ధరలు దాదాపు రెండింతలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా కొనుగోళ్లు తగ్గుతాయని అంతా భావించారు. కానీ, భారీగానే జరుగుతున్నాయి. పశ్చిమాసియాలో సాధారణంగా యుద్ధం జరిగితే ధరలు పెరుగుతాయి. కానీ, ఇరాన్ యుద్ధం సమయంలో బంగారం రేట్లు దిగివచ్చాయి. ప్రస్తుతం యుద్ధం సద్దుమణిగింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు రోజుల్లోనే తులం బంగారం రేటు రూ. 6000 మేర పెరిగింది. కానీ, ఇవాళ శాంతించిన పసిడి స్వల్పంగా దిగివచ్చింది. జులై 5వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4175 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 62 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లోనే దాదాపు 200 డాలర్ల మేర బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌లో బంగారం ధర. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు రూ.270 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ. 1,46,730 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 250 తగ్గడంతో రూ.1,34,500 వద్ద అమ్ముడవుతోంది. అయితే గ్లోబల్ మార్కెట్లో ధరలు మళ్లీ పెరుగుతున్న కారణంగా దేశీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్థిరంగా వెండి ధరబంగారం ధరలు దిగివచ్చినా వెండి మాత్రం అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో ఎలాంటి మార్పు లేకుండా రూ.2,60,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు జులై 5వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఉన్న రేట్లు. దేశీయంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందే స్థానికంగా ఉండే ధరలు తెలుసుకోవడం మంచిది. ప్రాంతాలను బట్టి సైతం ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది.