జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో పహల్గాం దాడి ఘటనతో సంబంధం ఉన్న లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది కూడా ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పోషియాన్ జిల్లాలో ఇనివారం రాత్రి ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. పోషియాన్ జిల్లా చన్‌పోరా గ్రామంలో రాత్రి 7:45 గంటల సమయంలో భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. READ ALSO మృతిచెందిన ఇద్దరు ఉగ్రవాదులను జాకీర్ అహ్మద్ గనీ, లతీఫ్ భట్‌గా గుర్తించారు. ఇందులో జాకీర్ అహ్మద్ గనీని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. లతీఫ్ అతనికి అసిస్టెంట్‌గా అధికారులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యానికి చెందిన 44, 20, 34 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లు, మూడు పారా, జమ్మూకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్స్ సంయుక్తంగా నిర్వహించాయి. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన జాకీర్ గనీ దక్షిణ కాశీలోని కుల్గాం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. భద్రతా బలగాలు అతడిని ఏ ++ కేటగిరి ఉగ్రవాది లిస్ట్‌లో ఉంచాయి. అతనిపై అనేక కేసులు ఉన్నాయని.. 2025 అక్టోబర్‌లో ఎన్ఐఏ కోర్టు అతన్ని వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. పహల్గామ్ ఉగ్రదాదిలోనూ జాకీర్ గనీ పేరు వెలుగులోకి వచ్చింది. పహల్గామ్ దాడితో పాటు భద్రతా సిబ్బందిపై దాడులు, కశ్మీర్ లోయలో టార్గెట్ చేసుకుని ఎంతో మంది హతమార్చిన ఘటనల్లో కూడా అతని ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇటీవల షోపియాన్ ప్రాంతంలో జాకీర్ గనీ మరో గుర్తు తెలియని ఉగ్రవాదితో కలిసి సంచరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీని భద్రతా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తుండగానే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. భారత సైన్యం కంబైండ్ ఆపరేషన్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది.