నిరాశపరిచినా నిలబడింది.. లిస్టింగ్ తర్వాత అప్పర్‌ సర్క్యూట్ కొట్టిన ఆస్తా స్పింటెక్స్ స్టాక్

Wait 5 sec.

IPO Listing: స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన ప్రముఖ కంపెనీ ఆస్తా స్పింటెక్స్ లిమిటెడ్ కంపెనీ జులై 6వ తేదీ సోమవారం రోజున లిస్టింగ్ అయింది. ఈ కంపెనీ స్టాక్ ప్రాథమిక మార్కెట్లో నష్టాలతో అడుగుపెట్టింది. ఐపీఓ ధరతో పోలిస్తే దాదాపు 4 శాతం మేర నష్టంతో లిస్టింగ్ కావడంతో ఇన్వెస్టర్లు కొంత నిరాశకు గురయ్యారు. అయితే, ఆ తర్వాత వేగంగా కోలుకుని నిలబడింది. నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చి ఇన్వెస్టర్ల ముఖంలో నవ్వులు పూచించింది. లిస్టింగ్ సహా పూర్తి వివరాలు తెలుసుకుందం. జులై 6వ తేదీ సోమవారం రోజున నష్టాల్లో లిస్టింగ్ అయిన ఆస్తా స్పింటెక్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు ఆ తర్వాత వేగంగా పుంజుకుని 5 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ కొట్టాయి. దీంతో లిస్టింగ్ నష్టాలను భర్తీ చేశాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఐపీఓ ధర రూ.136తో పోలిస్తే 4.41 శాతం నష్టంతో రూ.130 వద్ద ఈ స్టాక్ లిస్టింగ్ అయింది. కానీ, ఆ తర్వాత మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకింది. ప్రస్తుతం రూ.136 పైన ట్రేడింగ్ అవుతోంది. లిస్టింగ్ తర్వాత కంపెనీ మార్కెట్ విలువ రూ.598.13 కోట్లు తాకింది. ఆస్తా స్పింటెక్స్ లిమిటెడ్ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) 4.64 రెట్ల సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.125 నుంచి రూ.136గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.170 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వచ్చింది. ఆస్థా స్పిన్‌టెక్స్ కార్డెడ్, కోమ్డ్ మరియు కాంపాక్ట్ కోమ్డ్ పత్తి నూలు, పత్తి బేళ్లు, సంబంధిత ఉప-ఉత్పత్తుల తయారీ, వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ గుజరాత్‌లోని మోర్బి జిల్లా హల్వాద్‌లో ఒక సమీకృత స్పిన్నింగ్, జిన్నింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో బలమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. రూ.351 కోట్ల ఆదాయాన్ని చూపించింది. అంతకు ముందు ఏడాది రూ.239 కోట్లుగా రెవెన్యూ రాగా ఈసారి అది భారీగా పెరిగింది. అదే సమయంలో నెట్ ఫ్రాఫిట్ రూ.1 కోటి నుంచి ఏకంగా రూ.23 కోట్లకు చేరుకుంది. కంపెనీ బలమైన పనితీరును ఈ గణాంకాలు చూపిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫాల్కన్ ధారాల కొనుగోలుతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాజిటివ్ సంకేతాలతో ఈ ఐపీఓకు మంచి స్పందన లభించింది. అయితే లిస్టింగ్‌తో కాస్త నిరాశపరిచిందని చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత కోలుకోవడం గమనార్హం. Disclaimer: ఈ కథనం ఇన్వెస్టర్లకు సమాచారం ఇచ్చేందుకు మాత్రమే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. ఎంచుకునే స్టాక్ గురించి అన్ని తెలుసుకుని, నిపుణుల సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.