తుపాను, భారీ వర్షం వచ్చినా డబ్బులొస్తాయ్.. కొత్త పథకం తెచ్చిన కేంద్రం.. సర్వత్ర సురక్ష ప్లాన్ వివరాలివే!

Wait 5 sec.

New Insurance Policy: కరోనా మహమ్మారి తర్వాత ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత పెరిగింది. ఎక్కువ మంది ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలకు బీమా రక్షణ దాదాపుగా ఉండదు. కానీ,ఇప్పుడు ఆ భయం అవసరం లేదు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు (భారీ వర్షాలు, తుపాన్లు, భూకంపాలు) వల్ల తలెత్తే ఆర్థిక నష్టాల నుంచి పాలసీని కేంద్ర ప్రభుత్వ బీమా సంస్థ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రారంభించింది. అదే సర్వత్ర సురక్ష పారామెట్రిక్ పాలసీ (Sarvatra Suraksha Parametric Policy). మరి ఈ పాలసీ గురించిన వివరాలు తెలుసుకుందాం. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే నష్టం ఎంత జరిగిందో లెక్కించే వరకు ఆగకుండా వాతావరణంలో మార్పులు ఉదాహరణకు గాలి వేగం, వర్షపాతం నిర్దేశిత పరిమితి దాటిన వెంటనే క్లెయిమ్ డబ్బులు ఆటోమేటిక్ గా ఖాతాలో డబ్బులు పడిపోతాయి. సాంప్రదాయ ఇన్సూరెన్స్ పాలసీలకు భిన్నంగా సర్వత్ర సురక్ష పారామెట్రిక్ పాలసీని లాంచే చేసింది. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టం జరిగిన తర్వాత సర్వే చేసి డబ్బులు ఇస్తాయి. కానీ ఈ పారమెట్రిక్ పాలసీలో వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం వంటి కొలవదగిన అంశాలను ముందే నిర్ణయిస్తారు. భూకంపం, తుపాను వంటి ప్రకృతి విపత్తు తీవ్రత పరిమితి దాటిన వెంటనే అసలు ఎంత నష్టం జరిగిందనే దానితో సంబంధం లేకుండా ముందే అనుకున్న క్లెయిమ్ అమౌంట్ నేరుగా అందిస్తారు. తక్కువ పత్రాలు, అత్యంత వేగవంతమైన, పారదర్శకమైన క్లెయిమ్ చెల్లింపులు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2047 నాటికి అందరికీ బీమా అనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ పాలసీని రూపొందించినట్లు తెలిపింది. ఈ పారామెంట్రిక్ ఇన్సూరెన్స్ విధానంలో క్లెయిమ్ చెల్లింపుల ప్రక్రియ అత్యంత వేగంగా ఉంటుంది. కనీస పత్రాలతో సులభంగా, పారదర్శకంగా త్వరితగతిన క్లెయిమ్ పరిష్కారం కావడం ఈ పాలసీ ప్రత్యేకత. ఈ పాలసీ కింద చెల్లింపులు, వాతావరణాన్ని కొలిచే నిర్ధిష్ట ప్రమాణాల ఆధారంగా ఉంటుంది. ఒప్పందంలో పేర్కొన్న పరిమితికి తీవ్రత చేరిన వేంటనే క్లెయిమ్ మొత్తం నేరుగా అందుతుంది. ఇందులో వాస్తవంగా జరిగిన నష్టంతో సంబంధం లేకుండా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే చెల్లింపులు చేస్తారు. నిర్దేశిత పరిమితికి మించి తీవ్ర ఉన్నప్పుడు క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది. వేగంగా క్లెయిమ్ సొమ్ము ఖాతాలో జమ చేస్తారు. ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.