యాక్సిస్ బ్యాంక్ శుభవార్త.. FD వడ్డీ రేట్లు పెంపు.. సీనియర్లకు రూ.5 లక్షలపై గరిష్ఠ రేటుతో ఎంతొస్తుంది?

Wait 5 sec.

Axis Bank FD Rates: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకు తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రూ.3 కోట్లలోపు విలువ గల రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచినట్లు తెలిపింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లను జులై 4, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలోపు ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే 50 బేసిస్ పాయింట్ల వరకు అదనపు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. అలాగే 18 నెలల నుంచి 10 సంవత్సరాల లోపు టెన్యూర్ గల డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు గరిష్ఠంగా 6.5 శాతం వడ్డీ ఇస్తుండగా ఐదు సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.75 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. జనరల్ కస్టమర్లతో పోల్చితే సీనియర్ సిటిజన్లకి 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ ఇస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో సవరించిన వడ్డీ రేట్లు ఇప్పుడు ఏ టెన్యూర్ పై ఎంత ఉన్నాయో జాబితా పరిశీలిద్దాం. 7 రోజుల నుంచి 29 రోజుల కాల పరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 3 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. 30 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ అందిస్తుంది.46 రోజుల నుంచి 60 రోజుల డిపాజిట్లపై 4.00 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 61 రోజుల నుంచి 87 రోజుల కాల పరిమితి డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీ అందిస్తుంది.88 రోజుల నుంచి 6 నెలల డిపాజిట్లపై బ్యాంకు 5.00 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 6 నెలల నుంచి 9 నెలల డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.50 శాతం వడ్డీ అందిస్తుంది.9 నెలల నుంచి 12 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. 1 సంవత్సరం నుంచి 15 నెలలలోపు డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ అందిస్తుంది.15 నెలల నుంచి 18 నెలలలోపు కాలపరిమితి డిపాజిట్లపై 6.45 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.18 నెలల నుంచి 10 సంవత్సరాలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ అందిస్తుంది.రూ.5 లక్షలకు సీనియర్లకు ఎంతొస్తుంది?ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు టెన్యూర్ గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తోంది. ఉదాహరణకు ఒక సీనియర్ సిటిజన్ 10 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుని రూ.5 లక్షలు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత చేతికి అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 10,77,200 వరకు వచ్చే అవకాశం ఉంది. అదే 5 సంవత్సరాలే ఎంచుకున్నట్లయితే మొత్తం రూ. 7,33,900 వరకు వచ్చే అవకాశం ఉంది.