స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఇప్పుడు ఎంతంటే?

Wait 5 sec.

Today: మన దేశంలో బంగారానికి ఉండే డిమాండ్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల వేళ దీనిని అలంకరణ సాధనంగా మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ సందర్భాల్లో ముందుగా గుర్తొచ్చేది పసిడే అని చెప్పొచ్చు. ఇది అంతలా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. ఇంకా ఇది కేవలం ఆభరణంగానే కాదు పెట్టుబడికి కూడా మంచి సాధనంగా ఉంది. గత కొంత కాలంగా భారీగా పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్ట్‌మెంట్ పరంగానూ దీనికి గిరాకీ ఎక్కువైందని చెప్పొచ్చు. పసిడితో పాటుగా వెండికి కూడా డిమాండ్ అలానే ఉంటుంది. అందుకే వీటి ధరల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం జులై 6న బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. . యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారం గత కొద్ది రోజులుగా ఆకర్షణ కోల్పోయి ధర తగ్గగా.. ఇటీవల యూఎస్ జాబ్స్ డేటా (నాన్ ఫామ్ పేరోల్స్ డేటా) విడుదల కాగా ఇది అంచనాల్ని తగ్గించింది. బలహీనమైన జాబ్స్ డేటా కారణంగా డాలర్ పతనమైంది. ఇది ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాల్ని నీరుగార్చింది. దీంతో బంగారం మళ్లీ ర్యాలీ చేస్తుంది. గత వారం చివరి నుంచి పెరుగుతూనే వస్తుండగా ఈ క్రమంలో 2 వారాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4200 డాలర్ల స్థాయికి చేరుకోగా, సిల్వర్ రేటు 62.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది. రూపాయి విలువ డాలరుతో చూస్తే రూ. 95.25 వద్ద ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం దేశీయంగా మాతం గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పుత్తడి ధర ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,34,500 వద్ద ఉంది. ముందటి రోజు ఇది రూ. 250 మేర తగ్గింది. దానికి ముందు 2 రోజుల వ్యవధిలో రూ. 6 వేల వరకు పెరగడం గమనార్హం. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే తులం ప్రస్తుతం రూ. 1,46,730 వద్ద ఉంది. Hyderabad Silver Rates: బంగారం సంగతి ఇలా ఉండగా మరోవైపు హైదరాబాద్ నగరంలో స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కేజీకి రూ. 2.60 లక్షలు పలుకుతోంది. గత నెలలో జూన్ 25న ఇది రూ. 2.30 లక్షల స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి సుమారు రూ. 30 వేల వరకు పెరిగిందన్నమాట. సిల్వర్ ఆల్ టైమ్ హై వాల్యూ ఈ ఏడాది జనవరి 29న రూ. 4.25 లక్షల మార్కుకు చేరింది. అక్కడి నుంచి రూ. 1.65 లక్షలు తగ్గింది.