ఒక్క షేరు కొంటే.. 2 షేర్లు ఫ్రీ ఫ్రీ! హిందూస్తాన్ ఇన్సూలెటర్స్ మెగా బోనస్ ఆఫర్.. రికార్డ్ తేదీ ఫిక్స్

Wait 5 sec.

: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సెక్టార్ కంపెనీ హిందూస్తాన్ ఇన్సులేటర్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Hindusthan Insulators & Industries Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తెచ్చింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై తాజాగా ఈ బోనస్ షేర్లకు అర్హులైన వారిని నిర్ణయించే రికార్డు డేట్ జూలై 10గా నిర్ణయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. జూలై 10కి ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఈ కంపెనీ షేర్స్ ఎక్స్- బోనస్ ట్రేడింగ్ చేనుంది. ఈ బోనస్ ఇష్యూ ప్రకారం.. రికార్డ్ తేదీలోపు 1 షేర్ కొనుగోలు చేసిన వారికి అదనంగా 2 ఈక్విటీ షేర్స్ బోనస్ రూపంలో వస్తాయి. దీని అర్థం ప్రతి 100 షేర్ల కొనుగోలుపై ఏకంగా 200 షేర్స్ ఉచితంగా వస్తాయి. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాదిలో 195 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో నిలిచింది. అంటే లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొన్నవారికి రూ.2.95 లక్షల వరకు అందించింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం కొద్ది రోజుల క్రితం జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 2:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని కొనుగోలు చేసి తమ షేర్లను బోనస్ రూపంలో ఉచితంగా జారీ చేస్తారు. తాజాగా అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ జూలై 10, 2026గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. చివరి ట్రేడింగ్ సెషన్లో హిందూస్తాన్ ఇన్సులేటర్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు ధర 1 శాతం లాభంతో రూ.1272.20 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.1272.20, అలాగే 52 వారాల కనిష్ఠ ధర రూ. 449.95 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు సుమారు 1 శాతం లాభాన్ని అందించింది. గత నెల రోజుల్లో 3 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 176 శాతం లాభాన్ని అందించింది. గత ఏడాది కాలంలో 195 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఐదేళ్లలో 75 శాతం లాభాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 918 కోట్ల వద్ద ఉంది.