ఈవారం మార్కెట్లోకి 6 కొత్త మ్యూచువల్ ఫండ్స్.. రూ.500 ఉంటే చాలు.. సబ్‌స్క్రిప్షన్ తేదీలు ఇవే!

Wait 5 sec.

New Fund Offer: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ముఖ్యంగా యువత ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడానికి బదులుగా ఈక్విటీ ఫండ్స్ ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. మార్కెట్‌తో పోలిస్తే ఇందులో రిస్క్ తక్కువగా ఉండడం, హైరిటర్న్స్ రావడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు సైతం ఈ వారం సైతం (ఎన్ఎఫ్ఓ)లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఒకేసారి 6 కొత్త పథకాలను లాంచ్ చేస్తున్నాయి. కనీస పెట్టుబడి రూ.500 నుంచే ప్రారంభమవుతోంది. మరి ఈ స్కీమ్స్ గురించిన వివరాలు తెలుసుకుందాం. ఈ వారం వస్తున్న న్యూ ఫండ్ ఆఫర్ పథకాల్లో మూడు పాసివ్ ఫండ్స్ ఉండగా మిగిలిన మూడు యాక్టివ్ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఆరు కొత్త ఫండ్లలో రెండు ఫండ్స్ మీరే అసెట్ మ్యూచువల్ ఫండ్, నుంచి ఉండగా మిగితా రెండు ఫండ్స్ ఎడల్వేయిస్ మ్యూచువల్ ఫండ్, అల్ఫా గ్రెప్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఉన్నాయి. మరి ఆయా ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్, కనీస పెట్టుబడి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. మీరే అసెట్ ఏఎంసీ నుంచి 2 ఫండ్స్(Mirae Asset BSE Midcap 150 Momentum 30 ETF) సహా మీరే అసెట్ బీఎస్ఈ మిడ్ క్యాప్ 150 మూమెంటమ్ 30 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (BSE Midcap 150 Momentum 30 ETF FOF) సబ్‌స్క్రిప్షన్ కోసం వస్తున్నాయి. జులై 6వ తేదీ సోమవారం రోజు ప్రారంభమై జులై 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఇందులో కనీస పెట్టుబడి రూ.5000గా నిర్ణయించారు. ఎన్‌జీ ఏఎంసీ నుంచి 2 ఫండ్స్ఎన్‌జే వాల్యూ ఫండ్, ఎన్‌జే మూమెంటమ్ ఫండ్ (NJ Momentum Fund) న్యూ ఫండ్ ఆఫర్స్ సబ్‌స్క్రిప్షన్ జులై 10వ తేదీన మొదలవుతోంది. జులై 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.500గా నిర్ణయించారు. ఆల్ఫా గ్రెప్ మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్న్యూ ఫండ్ ఆఫర్లో భాగంగా ఆల్ఫా గ్రెప్ మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జులై 6వ తేదీన మొదలవుతోంది. ఇది జులై 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.500గా నిర్ణయించారు. ఎడెల్వాయిస్ నిఫ్టీ మెట్ల ఈటీఎఫ్ఎడెల్వాయిస్ నిఫ్టీ మెట్ల్ ఈటీఎఫ్ (Edelweiss Nift Metal ETF) న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ జులై 6వ తేదీన మొదలవుతోంది. జులై 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5000గా నిర్ణయించారు.