విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు!

Wait 5 sec.

టీమిండియా స్టార్ బ్యాటర్ .. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధం అవుతున్నాడు. జులై 14 నుంచి ఈ సిరీస్ ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. అయితే గాయం కారణంగా అప్ఘాన్‌తో సిరీస్‌కు దూరమైన అతడు.. ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ ప్రారంభించాడు. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీ20లు, గతేడాది టెస్టులకు వీడ్కోలు పలికాడు. టీ20 రిటైర్మెంట్ ఎలా ఉన్నా.. టెస్టులకు కోహ్లీ గుడ్ బై చెప్పడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.తనకు ఇష్టమైన ఫార్మాట్ రెడ్ బాల్ క్రికెట్ అని పదే పదే చెప్పే.. కోహ్లీ సడెన్‌గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనే ప్రశ్నలు వచ్చాయి. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎన్నో మార్పులు జరిగాయని, ఒత్తిడి వల్లే ఆ నిర్ణయం తీసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ దీనిపై కోహ్లీ మాత్రం ఎప్పుడూ నోరు విప్పలేదు. ఇక ఇప్పటికీ విరాట్.. తిరిగి టెస్టుల్లోకి రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా టీమిండియా క్రికెట్ దిగ్గజం .. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు."నాకు తెలిసి కోహ్లీకి ఇంకా టెస్టు క్రికెట్‌లో ఆడే సామర్థ్యం ఉంది. కానీ ఎందుకు ఆ ఫార్మాట్‌ను అనూహ్యంగా వీడాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ టెస్టుల్లో 10 వేల పరుగులు చేయలేదు అనేది విషయం కాదు. విరాట్‌లో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. కానీ అది కోపంలో తీసుకున్న నిర్ణయమేమో అని నాకు అనిపించింది. ఏది ఏమైనా.. ఆట విషయంలో ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకూడదు. సెలక్టర్లు ఎంపిక చేయకపోయినా సమస్య లేదు. కాస్త విరామం తీసుకుని తిరిగి రాణించాలి. మోహిందర్ అమర్‌నాథ్, అన్షుమాన్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు అదే చేసి చూపించారు. కానీ కోహ్లీ నిర్ణయం నన్ను నిరాశపరిచింది" అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు."కోహ్లీ అగ్రెషన్‌ను చూస్తుంటే అమెరికా టెన్నిస్ దిగ్గజం జాన్ మెక్‌ఎన్రో గుర్తుకు వస్తాడు. విరాట్‌కు ఆవేశం ఎక్కువ. జాన్ లాగే.. అతడు కూడా ఒత్తిడిలోనే ఎక్కువగా రాణిస్తాడు. అగ్రెషన్ లేకపోతే.. అతడు అత్యుత్తమ ఆట ఆడలేడు. కోహ్లీ తన ఆవేశాన్నే ఆయుధంగా మార్చుకుని ఆడతాడు" అని కపిల్ దేవ్ అన్నారు.