మీ ఐటీ రిటర్న్స్ ఎవరితో ఫైల్ చేయించాలి? CA, ERI, ARల మధ్య తేడా ఏంటో తెలుసుకోండి!

Wait 5 sec.

ITR Filing: రిటర్నులు ఫైల్ చేయడం అనేది ప్రతి ఒక్కరికీ సులభం కాకపోవచ్చు. సంక్లిష్టమైన లావాదేవీలు ఉన్నప్పుడు పొరపాట్లు, తప్పులు జరగకుండా నిపుణుల సాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ దీని కోసంచార్టర్డ్ అకౌంటెంట్లు, ఈ-రిటర్న్ ఇంటర్మీడియరీస్, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మరి ముగ్గురిలో ఎవరితో రిటర్న్స్ ఫైల్ చేయించాలి, ఈ ముగ్గురి మధ్య తేడా ఏంటి? అనే వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ట్యాక్స్ పేయర్లు తమ అవసరాలకు తగినట్లుగా విభిన్న కేటగిరీల ప్రతినిధులను అపాయింట్ చేసేందుకు ఇ-ఫైలింగ్ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. ఇందులో సీఏలు, ఈఆర్ఐ‌లు, అధికారిక ప్రతినిధులు ఉంటారు. వీరి మధ్య స్పష్టమైన తేడాలు, బాధ్యతలు ఉన్నాయి. తాము ఏ ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాం, మన ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయి, ఎన్ని విధాలుగా ఆదాయాలు వస్తున్నాయి అనే వివరాల ప్రకారం ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. చార్టర్డ్ అకౌంటెంట్లు (CA)చార్టర్డ్ అకౌంటెంట్లు ట్యాక్స్ రూల్స్ నిపుణులు. ఫైలింగ్ పోర్టల్‌లో మై సీఏ ద్వారా యాడ్ చేసుకోవాలి. నోటీసులకు రిప్లై ఇవ్వడం, బిజినెస్ ఆడిటింగ్, ఫారమ్‌ల వెరిఫికేషన్‌కు వీరు సరైన ఎంపికగా చెప్పవచ్చు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సభ్యులుగా ఉంటారు. ప్రొఫెషనల్ ట్యాక్స్, అకౌంటింగ్ సర్వీసులు అందిస్తారు. ఒకసారి వారికి అథారితీ ఇస్తే చట్టపరమైన ఫామ్స్ ఫైలింగ్, ఇ-వెరిఫై, ఫామ్ 15సీబీ పెద్దమొత్తంలో అప్లోడ్ చేయడం, సబ్మిట్ చేసిన ఫామ్స్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ రిజిస్టర్, సమస్యల పరిష్కారం వంటి వాటికి సహాయం చేస్తారు. ఇ-రిటర్న్ ఇంటర్మీడియెట్స్ (ERIs)సంస్థలను ఇ-రిటర్న్ ఇంటర్మీడియెట్స్ అంటారు. వారికి ఉన్న అథారిటీ ప్రకారం ఈఆర్ఐలు డిపార్ట్‌మెంట్ యుటిలిటీలను ఉపయోగిస్తారు. ఐటీ శాఖ ద్వారా గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ఏజెన్సీలు లేదా సాఫ్ట్‌వైర్లు. మై ఈఆర్ఐ సర్వీస్ ద్వారా వీరికి అనుమతి ఇవ్వవచ్చు. ఎండ్ టు ఎండ్ రిటర్న్ ఫైలింగ్, రీఫండ్ రీ-ఇష్యూ వంటి వాటికి వీరు సరిపోతారు. టఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ఎవరైనా విదేశాల్లో ఉన్నా లేదా అనారోగ్య కారణాల వల్ల సొంతంగా ఐటీ రిటర్నులు ఫైల్ చేయలేకపోయినా, లీగల్ వారసులు లేదా ప్రతినిధులను నియమించుకోవచ్చు. తమ ప్రతినిధులుగా అథరైజ్/ రిజిస్టర్ సర్వీస్ పొందవచ్చు. పరిస్థితులను బట్టి ఒక నిర్దిష్ట కాలానికి లేదా నిర్దిష్ట అవసరాలకు మాత్రమే వారికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు ట్యాక్స్ పేయర్లు పూర్తి యాక్సెస్ ఇస్తుంటారు.