ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ () కీలక పురోగతి సాధించింది. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రవాద సంస్థ చీఫ్ ప్రధాన సూత్రధారి అని పేర్కొంటూ అనుబంధ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఆదివారం జమ్మూ ఎన్ఐఏ కోర్టులో ఈ మేరకు ఛార్జ్‌షీట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ సమర్పించింది. లష్కరే తొయిబా, దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా.. వ్యక్తిగతంగానూ హఫీజ్ సయీద్‌ను ఈ దాడికి బాధ్యుడిగా ఎన్ఐఏ వివరించింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 25 పర్యాటకులు, ఒక టూరిస్ట్ గైడ్ సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ దాడికి పాక్ నుంచే కుట్రఎన్‌ఐఏ సమర్పించిన ఛార్జ్‌షీట్‌లోని వివరాల ప్రకారం.. ఈ దాడికి సంబంధించిన మొత్తం కుట్ర సరిహద్దు అవతలి (పాకిస్థాన్) నుంచే జరిగినట్టు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి హఫీజ్ సయీద్ స్వయంగా ఉగ్రవాదులకు దిశానిర్దేశనం చేశాడని, ఈ దాడికి కుట్రపన్ని, అమలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాడని తెలిపింది. అతడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా చట్టం 1967) సహా పలు చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద హఫీజ్‌పై కేసు నమోదుచేశారు.మొత్తం 1,597 పేజీలతో కూడి అసలు ఛార్జిషీట్‌కు అనుబంధంగా ఈ ఛార్జిషీట్ ఉంది. ఇందులో పాకిస్థాన్ పాత్ర, సయీద్ ప్రత్యక్ష ప్రమేయం, దాడి జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన శాస్త్రీయ, ఫోరెన్సిక్, సాంకేతిక సాక్ష్యాలు వివరంగా ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 15న దాఖలు చేసిన మొదటి ఛార్జ్‌షీట్‌లో పాక్ హ్యాండ్లర్ సాజిద్ జత్‌ను నిందితుడిగా పేర్కొంది. జులై 2025లో 'ఆపరేషన్ మహాదేవ్'లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు, అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు, ఈ దాడికి కుట్ర పన్ని, అమలు చేసినందుకు నిషేధిత సంస్థలు లష్కరే తొయిబా, దాని అనుబంధ విభాగం టీఆర్ఎఫ్‌ల కూడా ఇందులో పేర్కొంది.