తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న నెలకొంది. కుమార్తె జనని త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి సూర్యతేజ, జనని పెళ్లి ఆగస్టు నెలలో జరగనుంది. .. ఇప్పుడు పెళ్లి పనులు మొదలయ్యాయి. తన కుమార్తె వివాహ వేడుకకు రావాల్సిందిగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు బండ్ల గణేష్. పెళ్లి శుభలేఖలను స్వయంగా అందిస్తూ కూతురి పెండ్లికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే (Bandla Ganesh Daughter Wedding card) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ.. అతిథులను కూడా కుటుంబ వేడుకలో భాగం చేసేలా.. పట్టువస్త్రాలు బహూకరించి మరీ కుమార్తె పెళ్లికి ఆహ్వానిస్తు్న్నారు బండ్ల గణేష్. ఇక వివాహ ఆహ్వాన పత్రిక పైభాగంలో శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా నాయుడు ఆశీర్వాదాలతో అని బండ్ల గణేష్ రాయించడం ఇప్పుడు వైరల్ అవుతోంది. చంద్రబాబు కుటుంబంతో బండ్ల గణేష్‌కు ఉన్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జనని, సూర్యతేజ వివాహం ఆగస్ట్ 16వ తేదీ జరగనుంది. ఆదివారం ఉదయం 11 గంటల 58 నిమిషాలకు వివాహ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌ విస్పర్ వ్యాలీలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో బండ్ల గణేష్ కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. మరోవైపు బండ్ల గణేష్, చంద్రబాబు అభిమాని అని తెలిసిన సంగతే. 2023లో జైలులో ఉన్న చంద్రబాబు.. జైలు నుంచి విడుదల కావాలని, మరోసారి ముఖ్యమంత్రి కావాలని బండ్ల గణేష్ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. ఆ మొక్కును చెల్లించుకోవటం కోసం ఇటీవలేగా చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదం అందజేశారు. బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థానికి కూడా చంద్రబాబు దంపతులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ చంద్రబాబుతో బండ్ల గణేష్‍‌కు మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే తన కుమార్తె పెండ్లి శుభలేఖలో చంద్రబాబు దంపతుల పేర్లు వేయించారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.