Jio New Year 2.0 Plans: ₹15, ₹25, ₹50,₹399 & ₹3,999 Recharge Details(adsbygoogle = window.adsbygoogle || []).push({});జియో న్యూఇయర్ 2.0 ప్లాన్‌లు: ₹15, ₹25, ₹50, ₹399 మరియు ₹3,999 రీఛార్జ్ వివరాలు ఇవే ==================జియో కంపెనీపదేళ్ల వేడుకల్లో భాగంగా 'హ్యాపీ న్యూ ఇయర్ 2.0' పేరుతో నూతన ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. అన్లిమిటెడ్ 4జీ,5జీ డేటాతో కూడిన రూ.399 నెలవారీ ప్లాన్, రూ. 3999తో వార్షిక ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. స్వల్పకాలవ్యవధి కలిగిన మరో రెండు ప్లాన్లతో పాటు, నైట్ ప్యాక్ను తీసుకొచ్చింది.1. రూ.399 ప్లాన్: జియో కొత్తగా తీసుకొచ్చిన రూ.399 ప్లాన్లో 28 రోజులవ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత 4జీ, 5జీ డేటా, అపరిమిత వాయిస్కాల్స్,రోజుకు 100 ఎస్సెమ్మెస్లులభిస్తాయి. ఈ ప్లాన్తో రూ.4,000 విలువైన 12 నెలల కాన్వా ప్రో సబ్స్క్రిప్షన్, జియో హాట్ స్టార్ మొబైల్ ప్రయోజనాలు లభిస్తాయి.2. రూ.3,999 వార్షిక ప్లాన్: సుదీర్ఘ కాలంలో రీఛార్జి కోరుకునే వారికోసం రూ.3,999వార్షిక ప్లాన్ ను జియో ప్రకటించింది. ఈ ప్యాక్ 365 రోజుల పాటు అపరిమిత 4జీ, 5జీ డేటాతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ లులభిస్తాయి. అదనంగా 12 నెలల కాన్వా ప్రోలైట్ సభ్యత్వం, జియో హాట్ స్టార్, జియో టీవీ, ఫ్యాన్ కోడ్, 50జీబీ జియో ఏఐ క్లౌడ్ వంటి సదుపాయాలు లభిస్తాయి.3. రూ.15, రూ.25 ప్లాన్లనూప్రకటించింది. ఇవి ఒకటి, రెండ్రోజులవ్యాలిడిటీతో 5జీ డేటా ప్రయోజనాలను అందిస్తాయి. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.50తో నైట్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ డేటా ప్యాక్ తో రీఛార్జి చేసుకుంటే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకుఅపరిమిత 4జీ, 5జీ డేటా సేవలనుఆనందించొచ్చు.జియో కొత్తరూ.399,రూ.3,999 అన్-లిమిటెడ్ డేటాప్లాన్ల రీఛార్జి నవంబర్ 24 నుంచి అందుబాటులోకిరానుంది. అలాగే, రూ.25 అన్లిమిటెడ్ 5జీ యాడ్ ఆన్ ప్లాన్ కూడా అదేరోజునుంచి ప్రారంభం కానుంది. మరోవైపు, రూ.15 యాడ్ ఆన్ ప్లాన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా.. రూ.50 అన్లిమిటెడ్ నైట్ డేటా ప్యాక్ నవంబర్ 26 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.==================MYJIO APP – ANDROIDMYJIO APP - iOSWEBSITE==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});