Philips Launched their First Smartphone in India – Price & Fetures Details Here

Wait 5 sec.

 Philips Launched their First Smartphonein India – Price & Fetures Details Here (adsbygoogle = window.adsbygoogle || []).push({});ఫిలిప్స్ నుండితొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల – ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే ===================ఫిలిప్స్ కంపెనీదేశీయ మార్కెట్లో తొలి స్మార్ట్ఫోన్ ను విడుదల చేసింది. S7221 5G పేరుతో ఈ స్మార్ట్ఫోన్ ను విడుదల చేసింది. ఇతర స్మార్ట్ఫోన్కంపెనీలు ధరలు పెంచేస్తున్న వేళ.. కంపెనీ బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ఫోన్ నుతీసుకొచ్చింది. ఫిలిప్స్ S7221 5G స్మార్ట్ఫోన్లో 6.67 అంగుళాల హెచ్ + ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ 16తో పనిచేస్తుంది. Unisoc T765 ప్రాసెసర్ ను అమర్చారు. వెనుక వైపు 64 ఎంపీ ప్రధానకెమెరా ఇచ్చారు. ముందు వైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాఅందించారు. ఇందులో 5,700 ఎంఏహెచ్ బ్యాటరీఉంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. ఈ ఫోన్ బరువు 210 గ్రాములు. ఫోన్తో పాటు ఛార్జర్, ఎజెక్ట్ పిన్, టైప్-సి డేటాకేబుల్,స్క్రీన్ ప్రొటెక్టర్, ఫోన్ప్రొటెక్ట్ కేస్ ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Philips Connect India (@philipsconnects)ఇది రెండువేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.20,499గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 22,499గా పేర్కొంది. అమెజాన్ లో కొనుగోలు చేయొచ్చు. ఐపీ64 రేటింగ్ తో కూడిన డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఇందులో ఉంది. బ్లాక్, బ్లూ,సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.===================SMARTPHONE AMAZON LINK===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});