కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైనకొనసాగుతోంది. వేసవి సెలవుల సీజన్ ముగింపునకు రావటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ఇక వేసవిలో భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. అలాగే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. అయితే ఇంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఓ భక్తుడు వైకుంఠం క్యూ కాంప్లెక్సులోకి సెల్ ఫోన్‌తో ప్రవేశించారనే వార్త ఇప్పుడు కలకలం రేపుతంది. మొబైల్ ఫోన్‌తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన భక్తుడు.. కంపార్టుమెంట్లో వీడియో తీసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.సాధారణంగా శ్రీవారి దర్శనం కోసం వెళ్లే ముందు టీటీడీ సిబ్బంది.. భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో స్కానింగ్ చేసి మరీ.. నిషేధిత వస్తువులు ఆలయం వద్దకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా భక్తులు ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు వెంట తీసుకుని వస్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించకముందే.. వాటిని స్వాధీనం చేసుకుంటారు. లేదా సెక్యూరిటీ కౌంటర్లలో డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా దాటుకుని ఓ భక్తుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ఫోన్ తీసుకెళ్లాడనే వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా టీటీడీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. టీటీజీ విజిలెన్స్ సిబ్బంది ద్వారా పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని.. నిషేధిత వస్తువులు కొండపైకి, ఆలయ పరిసరాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయం, టీటీడీ అనుబంధ ఆలయాలలోని హుండీల ద్వారా భక్తులు సమర్పించిన బియ్యాన్ని టీటీడీ వేలం వేయనుంది. జూన్ 11న ఈ–వేలం ద్వారా వీటిని విక్రయించనుంది. మొత్తం 20 లాట్లలో 7,938 కిలోల బియ్యాన్ని వేలానికి ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు జూన్ 10వ తేదీ ఉదయం 10 గంటలలోపు konugolu పోర్టల్ ద్వారా రూ.50,000 ఈఎండీ (EMD) చెల్లించాలని సూచించింది. మరిన్ని వివరాలకు తిరుపతిలో ఉన్న టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.