భారత్ - అప్ఘనిస్థాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లో ముగిసిన ఈ టెస్టులో టీమిండియా ఆధిపత్య ధోరణి ప్రదర్శించింది. ఆరంభం నుంచి ఏకపక్షంగా సాగిన ఈ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ 2025 -27లో టీమిండియాకు ఈ విజయం చాలా సపోర్ట్ ఇవ్వనుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ టెస్టులో మూడో రోజు అప్ఘనిస్థాన్ రెండుసార్లు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 113/5తో మూడో రోజు ఆట మొదలుపెట్టిన అప్ఘనిస్థాన్.. మొదటి సెషన్‌లోనే 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ ప్రారంభించిన అప్ఘనిస్థాన్ లంచ్ బ్రేక్‌కి ముందు ఎలాంటి వికెట్లు కోల్పోలేదు. లంచ్ బ్రేక్ తర్వాత టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ తొలి వికెట్ తీసుకోగా.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ అప్ఘనిస్థాన్‌ బ్యాటర్లను పెవిలియన్‌కు క్యూ కట్టించాడు. ఓపెనర్ సెడికుల్లా అటల్ క్రీజులో ఉన్నంత సేపు కొంచెం పోరాడిన అప్ఘనిస్థాన్ ఆ తర్వాత నుంచి కుప్పకూలింది. దాంతో మూడో రోజు ఆట మిగిలుండగానే అప్ఘనిస్థాన్ కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. అప్ఘనిస్థాన్ బ్యాటర్లలో సెడికుల్లా అటల్ 42, రహ్మానుల్లా గుర్భాజ్ 24, రహ్మత్ షా 13 పరుగులు చేయగా.. మిగతా అందరూ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లలో సుందర్ 4, కుల్దీప్ 3, 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 127 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి డిక్లేర్‌ ఇచ్చింది. కేఎల్ రాహుల్ 100, 126, సాయి సుదర్శన్ 81, రిషభ్ పంత్ 81, వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు చేశాడు. ఈ టెస్టుతో ఎంట్రీ ఇచ్చిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్ ఒకటి ఓవరాల్‌గా ఏడు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు.