ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు హస్తినలోని భారత్‌ మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. అలాగే గురువారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే నీతి ఆయోగ్‌ 11వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరవుతారు. అనంతరం గురువారం రాత్రికి ఢిల్లీ నుంచి బయల్దేరి అమరావతి చేరుకుంటారు. చంద్రబాబు మాత్రమే కాదు ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. బుధవారం రాత్రికి ఢిల్లీలోనే ఉంటారు.. రాష్ట్రపతి భవన్‌లో గురువారం ఉదయం 9:15 నుంచి సాయంత్రం 5 గంటల నిర్వహిస్తున్న నీతి ఆయోగ్‌ 11వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. గురువారం రాత్రి రాత్రి 9 గంటలకు బయల్దేరి అమరావతికి వస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంతో పాటుగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్నారని చెబుతున్నా.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉందంటున్నారు. కొద్దిరోజులుగా కేంద్ర మంత్రివర్గ విస్తరణపై జోరుగు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీకి మరో పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి కేంద్రమంత్రివర్గంలో ముగ్గురు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు. ఒకవేళ కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఏపీకి మరో పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు.. అది కూడా కేంద్ర సహాయం మంత్రి పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిపైనా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.