22k Gold Rate Today: కిందటి రోజు ఒక్కసారిగా పెరగ్గా.. ఒక్కరోజులోనే మళ్లీ భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఇది కొనుగోలుదారులకు భారీ ఊరట కల్పిస్తుందని చెప్పొచ్చు. దేశీయంగా హైదరాబాద్ నగరంలో గోల్డ్ రేటు 22 క్యారెట్లపై ఇవాళ (జూన్ 10న) ఒక్కరోజులోనే రూ. 3950 తగ్గడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,36,450 వద్ద ఉంది. కిందటి రోజు ఇది రూ. 1350 పెరిగిన సంగతి తెలిసిందే. దానికి ముందు చూస్తే వరుసగా 10 రోజుల్లో బంగారం ధర పెరగనేలేదు. ఆ మధ్య రూ. 950, రూ. 2750, రూ. 350, రూ. 100, రూ. 750 ఇలా తగ్గుతూ వచ్చింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే ప్రస్తుతం వార్త రాసే సమయంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రూ. 4300 తగ్గడంతో తులం రూ. 1,48,860 కి పడిపోయింది. కిందటి రోజు ఇది రూ. 1470 పెరిగింది. ఇక బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పతనం అయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 10 వేలు తగ్గడంతో ప్రస్తుతం కేజీకి రూ. 2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధర గత కొద్ది రోజులుగా అసలు పెరగట్లేదు. ఇంకా జూన్ 4 నుంచి 6 మధ్య వరుసగా 3 రోజుల్లో కలిపి రూ. 20 వేలు తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి రేట్లు భారీ స్థాయిలో పతనం అయ్యాయి. ఒక్కసారిగా కరెక్షన్ కనిపించిందని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4170 డాలర్లకు పడిపోయింది. కిందటి రోజు చూస్తే ఇది 4330 డాలర్లపైన ఉండేది. అంటే రాత్రికి రాత్రే ఇది 150 డాలర్లకుపైగా తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు 11 వారాల కనిష్ఠానికి పడిపోవడం విశేషం. సిల్వర్ రేటు చూస్తే 68 డాలర్ల నుంచి 64 డాలర్ల దిగువకు చేరింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 95.44 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గేందుకు కారణం.. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం. అవును.. ఒకవైపు అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. దీంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగి.. బంగారం ధరలు పడిపోయేలా చేస్తుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది.