సీనియర్ హీరో మంచు మోహన్ బాబు, మధ్య గతంలో ఓ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాల వేడుకలో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. చిరంజీవికి 'లెజెండరీ' అవార్డు ప్రధానం చేసే సమయంలో అసహనం వ్యక్తం చేయడం, 'తమ్ముడూ మోహన్‌ బాబు' అంటూ పవన్ కళ్యాణ్ సెటైరికల్ కౌంటర్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అయితే ఈ వివాదం అసలు గుర్తు లేదని, పవన్ పై తనకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదని మోహన్ బాబు చెబుతున్నారు. మోహన్ బాబుతో ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ తాజాగా ఇంటర్వ్యూ నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రోమోని జాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్‌పై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు చేతకాక పోవచ్చు కానీ.. పేద ప్రజలపై కన్సర్న్ ఉంది కదా సార్'' అని జాఫర్ ప్రశ్నించగా.. ''ఏమో నాకు పెద్దగా తెలియదు. బహుశా ఉండొచ్చు. అతని మీద నాకు చెడు అభిప్రాయం లేదు'' అని మోహన్ బాబు బదులిచ్చారు. 'వజ్రోత్సవాలప్పుడు జరిగింది కూడా మనసులో లేదా?' అని అడగ్గా.. అది జరిగినట్టు కూడా గుర్తు లేదని చెప్పారు.* 'వజ్రోత్సవాల గొడవ జరిగిన తర్వాత ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ తో ఎదురుపడ్డారా?' అని జాఫర్ అడగ్గా.. ''కనిపిస్తే మాట్లాడుకుంటాం. అందులో డౌటే లేదు'' అని మోహన్ బాబు నవ్వుతూ అన్నారు. ఆ తర్వాత 'పవన్ కళ్యాణ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించే ఛాన్స్ వస్తే నటిస్తారా?' అని జాఫర్ ప్రశ్నించారు. దానికి మోహన్ బాబు స్పందిస్తూ.. ''రేపే అడ్వాన్స్ ఇప్పిస్తావా?. నేను విలన్ గా నటించడానికి రెడీగా ఉన్నాను. అడ్వాన్స్ ఇప్పించు. పవన్ కళ్యాణ్ తోనే కాదు..ఎవరితో నటించడానికైనా నాకు అభ్యంతరం లేదు. నేనొక నటుడిని. ఎలాంటి పాత్రా అయినా నేను చేస్తాను'' అని సమాధానమిచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. - మోహన్ బాబు మధ్య విభేదాలు ఉన్నాయని, ఆధిపత్యపోరు ఉండేదని గతంలో పెద్ద ఎత్తున పుకార్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఇరువురు పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకున్నారు. కానీ వజ్రోత్సవాల వేడుకలో జరిగిన వివాదం.. మెగా ఫ్యామిలీ, మోహన్ బాబు మధ్య దూరం పెంచిందనే మాట వాస్తవం. ఈ వేడుకలో చిరంజీవికి లెజండరీ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించగా.. ‘ఎవరు లెజండరీ?, ఎవరు సెలబ్రిటీ?’ అంటూ మోహన్‌ బాబు పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభకు ఎంపికై, పద్మశ్రీ అందుకున్న తాను లెజెండరీ అవార్డుకు అర్హుడిని కాదా? గిరిబాబు లాంటి సీనియర్లు అర్హులుకారా? అని మోహన్ బాబు వేదికపైనే నిలదీశారు. అప్పుడు 'మన తమ్ముడు మోహన్‌ బాబు చెప్పినట్టు' అంటూ పవన్ కళ్యాణ్ వ్యగ్యంగా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. దీంతో ఆ పురష్కారం తనకు వద్దని చిరంజీవి వారించారు. అప్పటి నుంచి మెగా, మంచు అభిమానుల మధ్య ఫ్యాన్ వార్లు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే గతంలో 'మా' అసోషియేషన్ మీటింగ్ లో చిరంజీవి, డా.రాజశేఖర్ మధ్య వాగ్వాదం జరిగినప్పుడు.. చిరుకి మోహన్ బాబు సపోర్టుగా నిలిచారు. ఆ తరువాత ఇద్దరూ పెద్దగా కలిసి కనిపించలేదు. 'సన్నాఫ్ ఇండియా' సినిమా టైంలో చిరు - మోహన్ బాబు ఇద్దరూ కలిసిపోయి అన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ సినిమా టీజర్ కి చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు.* అయితే మంచు విష్ణు 'మా' ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో.. ప్రకాష్ రాజ్ వర్గానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సపోర్ట్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మళ్లీ దూరం పెరిగినట్లయింది. రెండేళ్ల క్రితం 'ఏఎన్నార్ అవార్డ్' ప్రధానోత్సవ కార్యక్రమంలో వజ్రోత్సవాల వివాదాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం ఏమీ మనసులో పెట్టుకోకుండా.. ఆ వివాదం జరిగినట్లు కూడా గుర్తు లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా చేయడానికి కూడా మోహన్ బాబు రెడీ అంటున్నారు కాబట్టి, భవిష్యత్ లో ఈ కలయికలో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి.