రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్పారు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ సాగర్. స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో రామరాజు రెండో కొడుకుగా, నర్మద భర్తగా కీలక పాత్రలో నటిస్తున్న సాగర్ అసలు పేరు రఫిక్‌షా కాగా.. తాజాగా ఇతను సోషల్ మీడియాలో షేర్ చేసి పోస్ట్ వైరల్‌గా మారింది. మెగాఫ్యాన్స్‌ని, ముఖ్యంగా రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌ని హర్ట్ చేసింది. నిజానికి మనోడు.. ఎవర్నీ ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టకపోయినా.. రాంగ్ టైమింగ్‌లో ఆ పోస్ట్ పెట్టడంతో మిస్ ఫైర్ అయ్యింది. దాంతో చివరికి రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పేవరకూ వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సీరియల్ నటుడు రఫిక్‌షా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా వీడియోలు షేర్ చేస్తుంటారు. తన ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ అభిప్రాయాలను కూడా తన ఫాలోవర్స్‌తో పంచుకుంటాడు. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మూడ్ బాలేదని సినిమాకి వెళ్తే.. సినిమా కూడా బాలేదు’ అంటూ పోస్ట్ పెట్టారు. అయితే ఆ ముందు రోజే రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా రిలీజ్ కావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చ నడుస్తుండటం.. కొంతమంది బ్లాక్ బస్టర్ హిట్ అని అంటుంటే.. ఇంకొంతమంది మాత్రం.. అయ్యో తుస్సూ అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తుండటంతో మొత్తానికి ‘పెద్ది’పై పెద్ద చర్చే నడుస్తుంది. ఈ నేపథ్యంలో రఫిక్ షా.. ఇలాంటి పోస్ట్ పెడటంతో.. అతను బాలేదన్న సినిమా పెద్దినే అంటూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే.. థియేటర్స్ ఇఫ్పుడు పెద్దగా సినిమాలేం లేవు. ఒకవేళ ఉన్నాకూడా.. ఓ పక్క పెద్ది ప్రభంజనం నడుస్తున్న తరుణంలో ఏ సినిమా గురించి మాట్లాడినా కూడా.. ఆ సినిమా గురించే అనుకుంటారు కాబట్టి.. ఖచ్చితంగా మాట్లాడింది.. పెద్ది సినిమా గురించే అని మెగా ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. అయితే నిజానికి రఫిక్ షా.. తాను చూసింది పెద్ది సినిమా అని కానీ.. ఆ సినిమానే బాలేదని చెప్పానని ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే కొన్ని కావాలని అనకపోయినా చెప్పకపోయినా రాంగ్‌ టైమ్‌లో పోస్ట్ చేస్తే.. రాంగ్ పర్సన్స్‌కి రాంగ్‌గానే కన్వే అయిపోతుంటాయి. ఇప్పుడు ఇది కూడా అలాగే అయ్యింది. రఫిక్ షా పెద్ది సినిమా గురించి అనకపోయి ఉండొచ్చేమో.. అతని ఉద్దేశం అది కాదేమో కానీ.. ‘పెద్ది’ ఫ్యాన్స్‌కి మాత్రం కాస్త మండేట్టుగానే కన్ వే అయ్యింది. దీంతో అలర్ట్ అయిన రిఫిక్ షా వివరణ ఇస్తూ.. అసలు నేను పెద్ది సినిమానే చూడలేదు.. రామ్ చరణ్‌గారిని విమర్శించే స్థాయి నాది కాదు అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్తూ మరో వీడియో రిలీజ్ చేశారు. ‘నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే.. ఈరోజు మార్నింగ్ నా ఫ్రెండ్ ఒకరు ఒక పోస్ట్ పంపించారు వాట్సాప్‌లో. అందులో ఏముందుంటే.. పెద్ది సినిమా బాలేదని కామెంట్ చేసిన రఫిక్ షా అని ఉంది. నేను నిజం చెప్పాలంటే.. నేను పెద్ది గురించి కాదు ఆ పోస్ట్ పెట్టింది. ఇంకో విషయం ఏంటి అంటే.. అసలు నేను పెద్ది సినిమా ఇంత వరకూ చూడలేదు. నాకు టైమ్ దొరికినప్పుడు టికెట్స్ దొరకలేదు. త్వరలో ఖచ్చితంగా థియేటర్స్‌లోనే పెద్ది చూస్తాను. ‘నేను పెట్టిన పోస్ట్ ఏంటంటే.. మూడ్ బాలేదని సినిమాకి వెళ్తే.. సినిమా కూడా బాలేదు’ అని . అది నేను ఒక హ్యూమర్‌గా పెట్టాను. నేను నా వీడియోలన్నీ హ్యూమర్‌గా ఫన్నీగానే పెడుతుంటాను. ఇది కూడా అలాగే పెట్టాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే.. ఆవీడియోను రాంగ్ టైమ్‌లో పోస్ట్ చేశాను. దానికి పెద్దిని కనెక్ట్ చేసి సోషల్ మీడియాలో పెద్ది మూవీ గురించే ఆ పోస్ట్ పెట్టాడని వస్తుంది. దాని వల్ల రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని తెలుస్తోంది. వాళ్లందరికీ నేను సారీ చెప్పడం తప్ప ఇంకేం చెప్పలేను. ఎందుకంటే నేను ఆ ఉద్దేశంతో పెట్టలేదు. ఎందుకంటే నేను సినిమా లవర్‌ని. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగినోడ్ని. నేను ఈ సినిమా గురించే కాదు.. ఏ సినిమా గురించి కూడా నెగిటివ్ కామెంట్ చేయను. రామ్ చరణ్ గారి గురించి నెగిటివ్ కామెంట్ చేసేటంత అర్హత నాకు లేదు. ఆయన స్థాయి ఏంటో మనందరికీ తెలుసు. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారో కూడా అందరికీ తెలుసు. సారీ అండీ.. రాంగ్ టైమ్‌లో పోస్ట్ పెట్టడం వల్లే ఇదంతా అయ్యింది’ అంటూ క్లారిటీ ఇచ్చారు నటుడు రఫిక్ షా. అయితే రఫిక్ షా ఇంతకు ముందెన్నడూ పెద్దగా వివాదాల జోలికి పోలేదు. ఇతనిపై ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉండటంతో.. రిఫిక్ షా ఇచ్చిన వివరణపై సానుకూలంగానే స్పందిస్తున్నారు నెటిజన్లు.