వడ్డీ రేట్లు మార్చిన 4 బ్యాంకులు.. అత్యధికంగా 8.05 శాతం వడ్డీ.. రూ. 2 లక్షలపై ఎంతొస్తుంది?

Wait 5 sec.

: చాలా మంది సురక్షితమైన రిటర్న్స్ కోసం.. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటారని చెప్పొచ్చు. ఇక్కడ నిర్దిష్ట పెట్టుబడులపై.. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం.. నిర్దిష్ట కాల పరిమితులకు సంబంధించి రాబడి వస్తుంటుంది. చాలా వరకు బ్యాంక్ ఎఫ్‌డీల్లో రిస్క్ ఉండదు. ఇక్కడ వడ్డీ రేట్లు బ్యాంకుల్ని బట్టి మారుతుంటాయి. సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు సుమారు 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ వస్తుందని చెప్పొచ్చు. ఆర్బీఐ రెపో రేట్లను బట్టి.. బ్యాంకులు తరచుగా వడ్డీ రేట్లను మారుస్తుంటాయి. ఇక్కడ పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు లేదా స్థిరంగా కూడా ఉంచొచ్చు. ఇక ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులకు.. ప్రైవేట్ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అధిక వడ్డీ వస్తుంటుంది. >> గతేడాది 4 దఫాల్లో ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించగా.. బ్యాంకులు కూడా లోన్ వడ్డీ రేట్లు తగ్గించి.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా తగ్గించాయి. దీంతో ఇక్కడ వడ్డీ రేట్లు చారిత్రక కనిష్ఠాలకు పడిపోగా.. ఇవి ఆకర్షణ కోల్పోయాయి. అయినప్పటికీ.. కొన్ని బ్యాంకులు కాస్త బెటర్‌గానే వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఇప్పుడు జూన్ నెలలో 4 బ్యాంకులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించాయి. అవి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB), ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ బ్యాంకు. PNB సాధారణ ప్రజలకు కనీసం వారం నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు డిపాజిట్లపై 3 నుంచి 6.6 శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజెన్లకు 3.5 శాతం నుంచి 7.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక్కడ అత్యధికంగా 444 రోజుల వ్యవధికి అధిక వడ్డీ వస్తుంది. ఇక్కడ రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే 444 రోజులకు సాధారణ ప్రజలకు రూ. 16,201 వడ్డీ వస్తుంటే.. సీనియర్ సిటిజెన్లకు రూ. 17,437 వడ్డీ అందుతుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సాధారణ ప్రజలకు 3.50- 7.55 శాతంగా వడ్డీ రేట్లు ఉండగా.. సీనియర్ సిటిజెన్లకు అత్యధికంగా 3 ఏళ్ల ఒక రోజు నుంచి 3 సంవత్సరాల 6 నెలల డిపాజిట్లపై అత్యధికంగా 8.05 శాతం వడ్డీ వస్తుంది. ఇక్కడ రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే సాధారణ ప్రజలకు 3 ఏళ్ల 6 నెలల డిపాజిట్‌పై రూ. 58,027 వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజెన్లకు రూ. 62,250.72 అందుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే 2.70- 6.65 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజెన్లకు అత్యధికంగా 555 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం వడ్డీ అందుతుంది. రూ. 2 లక్షలు జమ చేస్తే 555 రోజులకు సాధారణ ప్రజలకు రూ. 20,666 వడ్డీ వస్తుంది. 7.15 శాతం వడ్డీ రేటుతో సీనియర్ సిటిజెన్లకు రూ. 2 లక్షలపై రూ. 22,249 వడ్డీ అందుతుంది. డీసీబీ బ్యాంకు సాధారణ ప్రజలకు 3.75-7.50 శాతం వడ్డీ ఇస్తుండగా.. సీనియర్ సిటిజెన్లకు అత్యధికంగా 24-25 నెలల వ్యవధిపై 8 శాతం వడ్డీ అందుతుంది. ఇక్కడ రూ. 2 లక్షలపై సాధారణ ప్రజలకు రూ. 32,522 వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజెన్లకు రూ. 34,780 వడ్డీ వస్తుంది.