రాజకీయాలకు దూరంగా ఉం లక్షలాది మంది అర్హులైన విద్యార్థులకు మంచి అవకాశంటున్న మాజీ ఎంపీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటుగా ఆయా రంగాలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తున్నారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి పథకాలు, ఇతర కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ వాటి ఆవశ్యకతను వివరిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తే బావుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏఐ మంత్రిత్వశాఖ,బెంగళూరుకు ప్రత్యేకంగా ఓ మంత్రిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఈ విధానాలను అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. విజయసాయిరెడ్డి తాజాగా ఏపీకి పొరుగున ఉన్న ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. 'ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కేజీ నుండి పీజీ వరకు విద్యను ఉచితంగా అందించాలన్న ఒడిశా నిర్ణయం స్వాగతించదగిన నిర్ణయం. ఇది లక్షలాది మంది అర్హులైన విద్యార్థులకు మంచి అవకాశం. ప్రతిభకు, అవకాశానికి ఆర్థిక స్థోమత ఎప్పుడూ అడ్డుగా నిలవకూడదు. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాలి' అని విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు.'ట్రంప్ వలస విధానాల (ఇమ్మిగ్రేషన్ పాలసీ) కారణంగా, అమెరికా నుంచి భారీ స్థాయిలో భారత్‌కు వలసలు పెరుగుతున్నాయి. భారతదేశంలో తెలివైన, ప్రతిభావంతులైన వారికి ఆవిష్కరణ, పరిశోధన, వ్యవస్థాపకతను ప్రోత్సహించే ఒక వ్యవస్థ అవసరం. గౌరవనీయ ప్రధానమంత్రి, కేంద్రమంత్రి అశ్వినివైష్ణవ్ గారికి ఇది నా విజ్ఞప్తి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తిరిగి వస్తున్నవారిలో ప్రతిభను వినియోగించుకునేలా చూడాలి' అంటూ ట్వీట్ చేశారు.'ఆంధ్రప్రదేశ్ కొత్త ఏవియేషన్ పాలసీ సాధ్యాసాధ్యాలపై అంచనా అవసరం ఉంది. ఇప్పటికే ఉన్న 6 విమానాశ్రయాలకు అదనంగా మరో 9 కొత్త విమానాశ్రయాల కోసం ప్రతిపాదించారు. కొత్త విమానాశ్రయాల కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించే ముందు.. ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను విస్తరించి, ఆధునీకరించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని గమనిస్తే మంచిది' అని విజయసాయిరెడ్డి హితవు పలికారు