Retirement Plan: తమ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల నుంచి నెల నెలా స్థిరమైన ఆదాయం పొందేందుకు రిటైర్మెంట్ తీసుకున్న వయోవృద్ధుల్లో సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ () ప్లాన్ పాపులర్‌గా మారింది. అయితే, ఎంత విత్ డ్రా చేసుకోవాలి, తమ అవసరాలకు తగినట్లుగా తమ పోర్ట్ ఫోలియోను ఎలా నిర్మించుకోవాలి అనే అంశాలు చాలా కీలకమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తమ రిస్క్ సామర్థ్యం, ఆదాయ అవసరాలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా తమ పెట్టుబడుల ద్వారా ఆదాయం పొందే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అలాంటి ఓ ప్రశ్నకు ఆర్థిక నిపుణులు ఏం చెప్పారు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.అటువంటి ఆయన తన మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో, భవిష్యత్తులో డబ్బును వెనక్కి తీసుకునే విధానం గురించి నిపుణుల సలహా కోరారు. ప్రస్తుతం ఈ పెట్టుబడిదారుడు ICICI లార్జ్ క్యాప్ ఫండ్ - డైరెక్ట్, HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్, ICICI భారత్ 22 ఫండ్ అనే నాలుగు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగి ఉన్నారు. ఒక్కో పథకంలో సుమారు రూ. 1 లక్ష చొప్పున పెట్టుబడి పెట్టారు. కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయించుకున్న ఆ పెట్టుబడిదారు, ఆరేళ్ల తర్వాత SWP (సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్) ద్వారా ఎంత ఆదాయం పొందవచ్చో, తన పోర్ట్‌ఫోలియో కూర్పులో మార్పులు చేయడం మంచిదేనా అని తెలుసుకోవాలనుకున్నారు.అసెట్ ఎలిక్సిర్ (Asset Elixir) వ్యవస్థాపకుడు, CFP శివం పాఠక్ ఈ పోర్ట్‌ఫోలియోను విశ్లేషించి ఎలా ప్లాన్ చేయాలో ఈటీ మ్యూచువల్ ఫండ్స్‌తో తెలిపారు. ప్రస్తుత విలువ సుమారు రూ. 4 లక్షలుగా ఉండగా, ఇందులో పెట్టుబడులు ప్రధానంగా ఈక్విటీ-ఆధారిత పథకాలలోనే ఉన్నాయి. అయితే పెట్టుబడిదారు వయసు ప్రకారం అధిక రిస్క్ తీసుకునేలా ఉంది. "ప్రస్తుత పోర్ట్‌ఫోలియో విలువ సుమారు రూ. 4 లక్షలు అని అనుకుంటే, ఇది ప్రస్తుతం ఈక్విటీ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తోంది. వయసు 74 ఏళ్లు కాబట్టి వృద్ధి అవకాశాలను అందిస్తూనే పోర్ట్‌ఫోలియోలో ఒడుదొడుకులను తగ్గించడంలో సహాయపడే 'హైబ్రిడ్' లేదా 'కన్జర్వేటివ్-ఓరియెంటెడ్' (తక్కువ రిస్క్ ఉండే) పథకాల్లో పెట్టుబడులను క్రమంగా ప్రారంభించాల్సి ఉంటుందని సూచించారు.SWP ప్లాన్ ద్వారా నెల నెలా ఎంత పొందొచ్చు?ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఉపసంహరించుకుంటామని ముందే భావించవద్దని నిపుణులు చెబుతున్నారు. తగిన విత్ డ్రా స్థాయి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. మొదటిది, పెట్టుబడులు ఎంత కాలం పాటు కొనసాగుతాయనే విషయం, రెండవది, కాలక్రమేణా సమకూరిన లాభాలుగా చెప్పారు. మూడవదిగా, పెట్టుబడిదారుడికి నెలవారీ ఆదాయం ఎంత అవసరం అనేది పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఇతర ఆదాయ వనరులు, చివరగా మొత్తం పదవీ విరమణ ప్రణాళికలో మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో పోషించే పాత్రను చూడాలి.గతంలో, 10-15 ఏళ్లపాటు తమ పెట్టుబడులను కొనసాగించిన వారు, తమ అసలు పెట్టుబడిలో అధిక భాగాన్ని కాపాడుకుంటూనే ఏటా సుమారు 5 శాతం నుంచి 6 శాతం వరకు ఉపసంహరించుకోగలిగారు. అయితే, ఇది గత అనుభవాలపై ఆధారపడి ఉంది కాబట్టి దీనిని ఒక హామీగా పరిగణించకూడదు అని ఈక్విటీ నిపుణులు తెలిపారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా 5-6 శాతం విత్ డ్రా చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. రూ. 4 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో అనేది వారి పదవీ విరమణ నిధిలో ప్రధాన భాగమా లేక మొత్తం పదవీ విరమణ ఆస్తులలో ఒక చిన్న భాగం మాత్రమేనా అనేది నిర్ధారించుకోవడం అవసరం. ఈ రూ.4 లక్షలను ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఇన్వెస్ట్ చేసి 5-6 శాతం ద్వారా విత్ డ్రా చేసుకుంటే ఏడాదికి రూ.24 వేల వరకు చేతికి వస్తాయి. నెలకు రూ.2 వేల వరకు పొందవచ్చు. అయితే, అతి ఎంచుకున్న ఫండ్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.