అమరావతికి కేంద్రం వరాలు.. రూ.2534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్.. కేబినెట్ ఆమోదం..

Wait 5 sec.

ఏపీ రాజధాని కురిపించింది. రాజధాని అమరావతికి కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. రూ. జీపీఆర్ఏ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణం కోసం సీపీడబ్ల్యూడీ కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపగా.. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఇందుకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రూ.1,299.08 కోట్లతో, రూ.1,234.91 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నివాస సముదాయం (జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కాంప్లెక్స్) నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్ భవనంలో కొలువుదీరనున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మల్టీస్టోరేజ్ నివాసాలు నిర్మించనున్నారు. మరోవైపు అమరావతిలో సెంట్రల్‌ సెక్రటేరియట్‌ ప్రాజెక్టు కోసం 22.53 ఎకరాలను సీఆర్‌డీఏ ఇప్పటికే కేటాయించింది. 5.53 ఎకరాల్లో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌, 17 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తి అయ్యింది. మరోవైపు అమరావతిలో ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ అద్దె భవనాల్లో నడుస్తుండగా సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి అయితే ఇవన్నీ కూడా సెక్రటేరియట్ కాంప్లెక్స్ భవనంలోకి మారనున్నాయి. సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టును పర్యావరణ హితంగా.. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఐకానిక్ డిజైన్‌తో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్, కాన్ఫరెన్స్ హాల్స్ , పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు.. మొత్తంగా సెంట్రల్ సెక్రటేరియట్ భవనం రాజధాని అమరావతికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రభుత్వ విభాగాలు అన్నీ ఒకేచోటకు చేరటం ద్వారా పాలనలో వేగం పెరగడంతో పాటు, అన్ని సేవలూ కూడా ప్రజలకు ఒకే చోట లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం లభించటంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరగనుంది.