తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Wait 5 sec.

తెలంగాణ ప్రజలకు చెప్పింది. నేడు, రేపు (శని, ఆదివారాల్లో) ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా సాగుతుండటంతో రాబోయే రెండు రోజులు అత్యంత కీలకమని అధికారులు వెల్లడించారు. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇప్పటికే కురుస్తున్న స్థిరమైన వర్షాలు కురుస్తుండగా.. క్రమంగా తగ్గుముఖం పడతాయని చెప్పారు. అదే సమయంలో నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నేడు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.గడిచిన 24 గంటల్లో నల్గొండ జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా పెద్దవూర మండలం పులిచెర్లలో అత్యధికంగా 11.2 సెం.మీ వాన కురిసి చెరువులను తలపించింది. అడవి దేవులపల్లి మండలం ముల్కచర్లలో 9.5 సెం.మీ, నాంపల్లి మండల కేంద్రంలో 8.2 సెం.మీ, త్రిపురారం మండలం మాటూరులో 7.9 సెం.మీ, దామరచర్ల మండలం తిమ్మాపూర్‌లో 6.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 7.9 సెం.మీ మేర వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. చందానగర్‌, మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, సనత్‌నగర్‌, అమీర్‌పేట, బోరబండ, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్‌, నారాయణగూడ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దాంతో ప్రధాన రహదారులపైకి భారీగా వరదనీరు చేరి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు రంగంలోకి దిగి నీటిని తొలగించే చర్యలు చేపట్టాయి.అయితే, రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు పడుతున్నప్పటికీ, మరోవైపు ఎండ తీవ్రత అస్సలు తగ్గడం లేదు. 16 జిల్లాల పరిధిలోని సుమారు 63 మండలాల్లో శుక్రవారం తీవ్రమైన వడగాలులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో జనం ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడ్డారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలంలో 42.8 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 22 జిల్లాల్లో ఎండల తీవ్రత 40.5 నుంచి 42.7 డిగ్రీల సెల్సియస్‌ మధ్య కొనసాగింది. ముఖ్యంగా నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాల పరిధిలోని మూడు మండలాల్లో తీవ్రమైన వడగాలులు ప్రభావం చూపాయి. నిజామాబాద్‌ జిల్లాలోనే అత్యధికంగా 11 మండలాలు ఈ వేడి గాలుల కారణంగా ఇబ్బందులు పడ్డాయి. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడుతుందని ఆశించిన ప్రజలకు, ఈ వడగాలులు, ఉక్కపోత తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని అధికారులు సూచించారు.