మీ ఆర్భాటాలు పక్కనపెట్టి.. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.. పవన్ కళ్యాణ్‌పై రాహుల్ రామకృష్ణ ట్వీట్

Wait 5 sec.

నటుడు సినిమాల్లో చేసే కామెడీతోపాటు.. సోషల్ మీడియాలో చేసే కామెంట్లతో ఎప్పడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన రాహుల్ రామకృష్ణ.. ఆ తర్వాత అడపాదడపా తన పోస్టులతో వైరల్‌గా మారుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే ట్వీట్ చేసిన రాహుల్ రామకృష్ణ.. '.. పెసా 1/70 చట్టం (ది పంచాయతీస్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్), గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి అడిగి చూపించండి అంటూ ప్రశ్నించారు. అటవీ విస్తరణ కార్యక్రమాలు మీరు చేశారా అని అడిగారు. ఒక స్వతంత్ర సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం.. గణాంకాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ లెక్కల కోసం తాను దాఖలు చేసి.. వాటి ద్వారా వచ్చిన ఫలితాలను అడుగుతున్నట్లు చెప్పారు. చివర్లో జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేసిన రాహుల్ రామకృష్ణ.. వీటితోపాటు మీరు సాధారణంగా చేసే ఆర్భాటాలు పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ నిర్వహించే ప్రతీ పదవిలోని ప్రతీ విభాగంలో సమాచార హక్కు చట్టంలోని క్రియాశీల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)ని అమలు చేశారా అని ప్రశ్నించారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానిని కాబట్టే అడుగుతున్నానని.. తాము అడిగే ప్రశ్నలకు నిరంతరం సమాధానం ఇవ్వాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. ఇక ఇటీవల జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ.. హైదరాబాద్‌లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పెట్టేందుకు ప్రయత్నించగా.. తెలంగాణ పోలీసులు అనుమతించకపోవడంతో.. పవన్ కళ్యాణ్.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి.. తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పి్స్తూనే ఉన్నారు. వాటికి నేతలు కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారి తీస్తున్నాయి.