: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం రోజు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్ని ప్రకటించింది. ఇక్కడ వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. రెపో రేటులో మార్పు లేకుండా 5.25 శాతంగానే ఉంచుతున్నట్లు తెలిపింది. కేంద్ర బ్యాంక్ గవర్నర్ .. ఎంపీసీ భేటీ నిర్ణయాల్ని వెల్లడించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్‌లో జరిగిన సమీక్షల్లోనూ ఇక్కడ వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచింది. అంతకుముందు ఏడాది వ్యవధిలో 125 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు తగ్గించింది. ఈ క్రమంలోనే గవర్నర్ మరో కీలక ప్రకటన చేశారు. అది కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా ఉన్న కరెన్సీ నోట్ల గురించి. అవును.. .. ఆర్బీఐ ఈ అంశాన్ని మళ్లీ పరిశీలిస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై సంజయ్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చారు. పాలిమర్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి కాగితపు కరెన్సీ నోట్లు సులభంగా మురికిగా మారుతుంటాయి. ఇంకా చిరిగిపోవడం, నీళ్లు పడితే తడిచి చిరిగిపోవడం వల్ల ఇట్టే పాడైపోయేవి. ఈ సమస్యను తీర్చే ఉద్దేశంతోనే ఆర్బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ఆలోచన చేసింది. అంత సులభంగా ఇవి పాడవకుండా ఎక్కువ మన్నికతో ఉండేలా తీర్చిదిద్దాలని చూసింది. పేపర్ కరెన్సీకి డిమాండ్ నేపథ్యంలో.. పాలిమర్/ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు తీసుకురావాలని ఆర్బీఐ పదేళ్ల కిందటే ప్రతిపాదించింది. సాంకేతిక, కార్యచరణ సమస్యల వల్ల ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు.ఇక్కడ ప్రధానంగా యూపీఐ అందుబాటులోకి వచ్చినా.. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నా.. కాగితపు కరెన్సీకి డిమాండ్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఇంకా రికార్డు స్థాయికి చేరుతుండటం గమనార్హం. ఇదే సమయంలో వీటి ముద్రణ ఖర్చు కూడా పెరుగుతోంది. మరోవైపు మార్కెట్లో గతంలో కంటే నకిలీ నోట్ల బెడద ఎక్కువైంది. కొత్త సిరీస్ రూ. 500 కరెన్సీ నోట్లు.. నకిలీవి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని.. నోట్ల మన్నిక పెంచేందుకు.. ఖర్చు తగ్గించేందుకు.. కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో వార్నిష్డ్ కరెన్సీ నోట్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.పాలిమర్ కరెన్సీలో సంప్రదాయ కాగితానికి బదులుగా పాలిప్రొఫైలిన్ అనే ప్రత్యేక ప్లాస్టిక్ పాలిమర్‌తో తయారు చేస్తారు. సాధారణ కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. ఇవి అంత ఈజీగా సులభంగా చిరగవు. నీటిలో తడిచినా పాడైపోవు. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ వంటి పలు దేశాల్లో ఈ తరహా ప్లాస్టిక్ కరెన్సీ విజయవంతమైంది.