Bonus Shares: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ట్రేడింగ్ సెక్టార్ కంపెనీ గౌతమ్ ఎక్సిమ్ లిమిటెడ్ (Gautam Exim Limited) బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై తమ షేర్ హోల్డర్లకు అదిరే శుభవార్త చెప్పారు. 3:1 రేషియోలో ఇవ్వాలని నిర్ణయించారు. ఈ బోనస్ షేర్ల జారీ రికార్డు డేట్ జూన్ 10గా నిర్ణయించారు. అంటే ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఆ రోజున షేర్లు ఎక్స్-బోనస్ ట్రేడింగ్ చేయనున్నాయి. ఇక ఈ బోనస్ ప్రకారం ఒకవేళ మీ వద్ద 100 షేర్స్ ఉంటే మరో 300 షేర్స్ ఉచితంగా పొందుతారు. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాదిలో 79 శాతం లాభాన్ని అందించింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఇటీవలే కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై 3:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. దీని అర్థం రికార్డు డేట్ నాటికి రూ. 5 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి అదనంగా రూ. 5 ఫేస్ వ్యాల్యూ ఉన్న 3 ఈక్విటీ షేర్స్ ఉచితంగా బోనస్ రూపంలో ఇస్తారు. ఈ బోనస్ షేర్ల జారీకి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ జూన్ 10, 2026గా డైరెక్టర్స్ బోర్డు నిర్ణయించింది. చివరి ట్రేడింగ్ సెషన్లో గౌతమ్ ఎక్సిమ్ లిమిటెడ్ షేరు 6.12 శాతం నష్టంతో రూ. 138 వద్ద ముగిసింది. అయితే ఇవాళ ఈ స్టాక్ ధర మరో 2.90 శాతం మేర నష్టంతో రూ.134 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 184.75 వద్ద, 52 వారాల కనిష్ఠ ధర రూ. 70.32 వద్ద ఉంది. ఈ కంపెనీని గతంలో గౌతమ్ ఎంటర్ ప్రైజెస్ అనేవారు. ఈ కంపెనీ ప్రధానంగా వేస్ట్ పేపర్, పల్ప్, క్రాఫ్ట్ పేపర్, డూప్లెక్స్ బోర్డ్, రైటింగ్, ప్రింటింగ్ పేపర్ వంటి కంపెనీలకు సరఫరా చేస్తుంది.గత ఐదేళ్ల కాలంలో 797 శాతం లాభాన్ని అందించింది. ఐదేళ్ల క్రితం ఇందులో ఒక లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ దాదాపు రూ.9 లక్షలు అవుతుంది.గత ఏడాది కాలంలో 74 శాతం లాభాన్ని అందించింది.గత ఆరు నెలల్లో 10 శాతం మేర పడిపోయింది.గత నెల రోజుల్లో సుమారు 16 శాతం నష్టపోయింది.గత వారం రోజుల్లో ఈ షేరు ధర 11 శాతం నష్టపోయింది.ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 82.57 కోట్లుగా ఉంది.