టాటాల కఠిన నిర్ణయం.. వారికి రూ.1000 కోట్ల పరువు నష్టం నోటీసు.. అసలేం జరిగిందంటే?

Wait 5 sec.

Tata Trusts: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, విలువలతో కూడిన కార్పొరేట్ సంస్థగా పేరుగాంచిన టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ట్రస్ట్స్‌లో ఒక వివాదంలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ ప్రతిష్టకు, లీగల్ ఇమేజ్‌కు భంగం కలిగించేలా చేసిన ఆరోపణలపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. తమపై వచ్చిన నిందలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో లీగల్ నోటీసులు పంపించింది. ఏకంగా వెయ్యి కోట్ల పరువు నష్టం నోటీసులు పంపించడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు టాటా ట్రస్ట్స్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వివాదం ఏంటి?దేశంలోని అతిపెద్ద సేవా సంస్థలలో ఒకటిగా ఉన్న టాటా ట్రస్ట్స్, సమాజ శ్రేయస్సు కోసం, వివిధ సామాజిక సేవా కార్యక్రమాల కోసం నిరంతరం కృషి చేస్తుంటుంది. అయితే, ఇటీవల కంపెనీ కార్యకలాపాలు, అంతర్గత నిర్వహణ లేదా లీగల్ విషయాలపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దివంగత నావల్ హెచ్ టాటాకు 1989లో నవాజ్ బాయ్ రతన్ టాటా ట్రస్ట్ (NRTT) చేసిన షేర్ల బదిలీపై సురేశ్ తులసీరామ్ పాటిల్‌ఖేడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరు పక్షాల మధ్య జరిగిన 833 షేర్ల బదిలీకి సంబంధించి దర్యాప్తు చేపట్టాలంటూ ఛారిటీ కమిషనర్ కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.ఖండించిన టాటా ట్రస్ట్స్1989లో నిర్వహించిన షేర్ల బదిలీలో ఎలాంటి తప్పు జరగలేదని టాటా ట్రస్ట్స్ పేర్కొంది. ఈ విషయంపై చేసిన ఆరోపణలను ఖండించింది. దివంగత నావల్ హెచ్ టాటాకు నవాజ్ బాయ్ రతన టాటా ట్రస్ట్ చేసిన షేర్ల బదిలీపై సదరు వ్యక్తి నిరాధారమైన, రుజువుల్లేని, దురుద్దేశపూర్వక ఆరోపణలు చేసినట్లు టాటా ట్రస్ట్స్ తెలిపింది. ఇరు పక్షాల మధ్య జరిగిన 833 షేర్ల బదిలీకి సంబంధించి సురేశ్ పాటిల్ ఖేడ్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ట్రస్ట్ ఈ మేరకు స్పంధించింది. ఈనెల 8వ తేదీన టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం జరగనుంది. సురేష్‌కు ఇది కొత్తేమి కాదని, 2020లోనూ ఇలాగే తమ దాతృత్వ కార్యకలాపాలకు భంగం కలిగించేలా కేసులు వేశారని టాటా ట్రస్ట్స్ వివరించింది.క్రితం నాటి 833 టాటా సన్స్ షేర్ల బదిలీపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని టాటా ట్రస్ట్స్ డిమాండ్ చేసింది. లేదంటే తమ పరువుకు భంగం కలిగించినందుకు రూ.1000 కోట్ల నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధం కావాలని హెచ్చరించింది. ఈ మేరకు ఇద్దరికి నోటీసులు పంపించింది. ఇరు సంస్థల బోర్డు ఆమోదం మేరకే షేర్ల బదిలీ జరిగిందని, ఎన్ఆర్‌టీటీ నుంచి నావల్ టాటా రాజీనామా చేసిన ఒక ఏడాది తర్వాత దివంగత లాయర్ నానీ పాల్ఖీవాలా పర్యవేక్షణలో జరిగినట్లు స్పష్టం చేసింది.