: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా ఉన్నటువంటి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచేసింది. దీనినే నిధుల ఆధారిత వడ్డీ రేటుగా చెబుతారు. ఎంపిక చేసిన టెన్యూర్లపై 10 బేసిస్ పాయింట్ల వరకు పెరగ్గా.. ఈ నిర్ణయం 2026, జూన్ 8 అంటే నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అంతకుముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎంసీఎల్ఆర్ రేట్లు 8.05 శాతం నుంచి 8.60 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 8.10 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగాయి. ఏ టెన్యూర్‌పై ఎలా పెరిగిందో చూద్దాం. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట 8.05 శాతం నుంచి 8.10 శాతానికి చేరింది. 3 నెలల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ చూస్తే 8.15 శాతం నుంచి 8.20 శాతానికి ఎగబాకింది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది.ఎక్కువగా కన్జూమర్ లోన్లకు లింక్ అయి ఉండే.. ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.45 శాతం నుంచి 8.55 శాతానికి చేరింది. మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.65 శాతానికి చేరింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ మాత్రమే మారకుండా స్థిరంగా 8.05 శాతంగా ఉంది. RBI రెపో రేటు యథాతథం..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. . వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను మార్చలేదు. అయితే సాధారణంగా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను మార్చితేనే.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను మారుస్తుంటాయి. కానీ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఆర్బీఐ రెపో రేటును మార్చకున్నా వడ్డీ రేట్లు పెంచడం గమనార్హం.ఎంసీఎల్ఆర్ అంటే ఏంటి?ఇక్కడ ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు లోన్లపై వసూలు చేసే కనీస వడ్డీ రేటుగా చెబుతుంటారు. అంటే ఇంతకంటే తక్కువ వడ్డీకి బ్యాంకులు కస్టమర్లకు లోన్లు ఇచ్చేందుకు వీల్లేదు. 2016లో ఆర్బీఐ ఈ విధానం తీసుకొచ్చింది. ఇక్కడ ఎంసీఎల్ఆర్ పెరిగితే.. ఇప్పుడు దానికి లింక్ అయి ఉండే బ్యాంక్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతాయి. అప్పుడు ఫ్లోటింగ్ రేటుపై లోన్ తీసుకున్న వారు అధిక ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. అంటే వడ్డీ భారం పెరుగుతుందన్నమాట.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ FD రేట్లు..ఇదిలా ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు సాధారణ ప్రజలకు కనీసం వారం నుంచి పదేళ్ల వ్యవధికి 2.75 శాతం నుంచి 6.50 శాం వరకు ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజెన్లకు చూస్తే 3.25 శాతం నుంచి 7 శాతం అందిస్తోంది.