: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయంపై కేంద్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యం దిశగా వేగంగా దూసుకెళ్తోంది. కొంత కాలంగా ప్రభుత్వ బ్యాంకులు, ఇతర మహారత్న, నవరత్న హోదా ప్రభుత్వ కంపెనీల్లో తమ వాటాల్ని విక్రయిస్తూ వస్తోంది. , పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ దిశగా దూకుడుగా వెళ్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో వాటా విక్రయం ద్వారా రూ. 80 వేల కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంస్థల ఆదాయం స్థిరంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజలుగా వరుసగా ప్రభుత్వ సంస్థల్లో కేంద్రం.. వాటాల్ని విక్రయిస్తూనే ఉంది. తాజాగా మరో ప్రభుత్వ రంగ కంపెనీలో వాటాల్ని విక్రయించేందుకు కేంద్రం ఆఫర్ ఫర్ సేల్ (OFS) ప్రకటించింది. అదే దిగ్గజ కోల్ మైనింగ్ కంపెనీ, పవర్ జనరేషన్ కంపెనీల్లో ఒకటైన ప్రభుత్వ సంస్థ NLC ఇండియా లిమిటెడ్. 2 రోజుల సేల్ ప్రాసెస్‌లో భాగంగా ఇక్కడ మొత్తం 3 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఇక్కడ ముందుగా బేస్ ఆఫర్ కింద 2 శాతం వాటాకు సమానమైన 2.78 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచనుంది. ఇన్వెస్టర్ డిమాండ్ బాగుంటే.. మరింత విక్రయించాలని అందుకోసం మరో ఒక శాతం వాటాకు సమానమైన 1.39 కోట్ల షేర్లను ఓవర్ సబ్‌స్క్రిప్షన్ లేదా గ్రీన్‌షూ ఆప్షన్ కింద ఉంచింది. 10 శాతం డిస్కౌంట్ ధరకే..ఎన్ఎల్‌సీ ఇండియా షేర్ క్లోజింగ్ ప్రైస్ జూన్ 8న రూ. 336 గా ఉండగా.. దానితో పోలిస్తే దాదాపు 10 శాతం డిస్కౌంట్ ధరకే అంటే రూ. 303 నే ఫ్లోర్ ప్రైస్‌గా నిర్ణయించింది. అంటే ఆఫర్ ఫర్ సేల్‌లో 10 శాతం తక్కువకే చాలా చీప్‌గా షేర్లను విక్రయిస్తోందన్నమాట. ఇక్కడ 2 శాతం వాటాను విక్రయిస్తే.. రూ. 842 కోట్ల వరకు నిధుల్ని సమీకరించనుంది. గ్రీన్ షూ ఆప్షన్ కూడా వినియోగిస్తే మొత్తం ప్రభుత్వ ఖజానాకు రూ. 1263 కోట్లు సమకూరనున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో వాటా విక్రయాలు..ఇక ఎన్ఎల్‌సీ ఇండియా ఓఎఫ్ఎస్.. నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు జూన్ 9న ఓపెన్ కానుంది. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సహా అర్హులైన కంపెనీ ఉద్యోగులు జూన్ 10న పార్టిసిపేట్ చేయొచ్చు. ఇటీవల కేంద్రం వరుసగా పలు ప్రభుత్వ సంస్థల్లో వాటాల్ని అమ్మేస్తూ వస్తుంది. ముందుగా భెల్, ఐఆర్ఎఫ్‌సీల్లో వాటాల్ని విక్రయించగా.. తర్వాత వరుసగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, NHPC ఇలా చాలా వాటిల్లోనే వాటాల్ని విక్రయించింది. వాటికి మంచి స్పందన కూడా లభించింది. NLC India Share Price: ఎన్ఎల్‌సీ ఇండియా షేర్ ధర జూన్ 9న ఉదయం 6.30 గంటల సమయంలో రూ. 336.40 వద్ద ఉంది. నెలలో 2 శాతం వరకు పెరగ్గా.. 6 నెలల్లో 40 శాతానికిపైగా పెరిగింది. ఐదేళ్లలో 400 శాతానికిపైగా పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. దీంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది. సంస్థ మార్కెట్ విలువ రూ. 46.50 వేల కోట్లుగా ఉంది.