25 రూపాయల స్టాక్ బంపరాఫర్.. 100 షేర్లు కొంటే మరో 40 షేర్లు వస్తాయ్..!

Wait 5 sec.

: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి అంటే రిస్క్‌తో కూడుకున్నదని చాలా మంది భావిస్తుంటారు. ఇది వాస్తవమే అయినప్పటికీ ఓపికతో పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలం కొనసాగిస్తే ఇబ్బందులు ఉండవని.. రిస్క్ తగ్గించుకొని మంచి రాబడి అందుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. ఇక్కడ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేేసే ముందు ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది. ఇంకా ఆయా కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రణాళికలు ఇలా అన్నీ గమనిస్తూ ఉండాలి. సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకోవాలి. స్వల్ప కాలం కంటే దీర్ఘకాలంలోనే కంపెనీలు.. ఇన్వెస్టర్లకు మంచి లాభాల్ని అందిస్తుంటాయి. ఇక్కడ లాంగ్ రన్‌లో కేవలం స్టాక్ ధర పెరగడం మాత్రమే కాదు.. డివిడెండ్లు, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ సహా షేర్ల బైబ్యాక్ వంటివి ప్రకటిస్తూ ఉంటాయి. ఇక్కడ అదనంగా ఎలాంటి పెట్టుబడి లేకుండా రాబడి పొందొచ్చు. ఇదే బాటలో ఇప్పుడు ఒక కంపెనీ షేర్ హోల్డర్లకు బోనస్ ఇష్యూ గురించి ప్రకటన చేసింది. అదే హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్. ఇది ప్రముఖ ఆర్కిటెక్చరల్ హార్డ్‌వేర్, గ్లాస్ ఫిటింగ్, మాడ్యులర్ కిచెన్ యాక్సెసరీల తయారీ, రిటైల్ కంపెనీ. ఇది షేర్ హోల్డర్లకు తాజాగా 2:5 రేషియోలో బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రోజు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. జూన్ 5న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై.. బోనస్ ఇష్యూను పరిశీలించి ఆమోదించారని చెప్పింది. ఇక్కడ 2:5 రేషియోలో బోనస్ ఇష్యూ అంటే.. రూ. 1 ముఖ విలువ (ఫేస్ వాల్యూ) ఉన్న ప్రతి 5 ఈక్విటీ షేర్లకు అదనంగా.. రూ. 1 ఫేస్ వాల్యూ ఉన్న 2 షేర్లు అదనంగా వస్తాయి. అంటే.. ఇక్కడ ప్రతి 5 షేర్లకు 2 షేర్లు అదనంగా వస్తాయి. అదే విధంగా 100 షేర్లు ఉంటే.. అదనంగా ఎలాంటి పెట్టుబడి లేకుండా 40 షేర్లు పొందొచ్చు. ఈ బోనస్ ఇష్యూకు ఎక్స్‌టార్డినరీ జనరల్ మీటింగ్‌లో (EGM) కూడా ఆమోదం లభించాల్సి ఉంది. ఇంకా రికార్డ్ డేట్ ప్రకటించలేదు. బోనస్ ఇష్యూలో భాగంగా కంపెనీ కొత్తగా మొత్తం 19.54 కోట్ల వరకు కొత్త షేర్లను షేర్ హోల్డర్లకు అందించనుంది. బోర్డ్ ఆమోదం తర్వాత దాదాపు 2 నెలల్లో బోనస్ షేర్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే ఆగస్ట్ 4 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక హార్డ్‌విన్ ఇండియా షేరు జూన్ 8న రూ. 24.59 వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ రూ. 1.20 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ, గరిష్ఠ ధరలు వరుసగా రూ. 10.87, రూ. 28.28 గా ఉన్నాయి. 6 నెలల్లో ఈ స్టాక్ 45 శాతం పెరిగింది. ఏడాదిలో 70 శాతం పుంజుకుంది. గమనిక: పైన ఇచ్చింది కేవలం సమాచారంగానే పరిగణించాలి. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందుగా సెబీ రిజిస్టర్డ్ ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి.