సెకండ్ హ్యాండ్ కారు, బైక్ కొంటున్నారా? కొత్త గైడ్‌లైన్స్ ఇవే, మోసపోకుండా పోలీసులు చెప్పిన జాగ్రత్తలు

Wait 5 sec.

ప్రస్తుతం , బైకులు కొనేవారు ఎక్కువయ్యారు. కొత్త వాహనం కంటే వాడేసిన వాహనాలు కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో సెకండ్ హ్యాండ్ కార్లు, బైకులు అమ్మే సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొందరు వ్యాపారులు అమాయకులను మోసం చేసి చోరీ చేసిన వాహనాలను అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాహన చోరీలకు ముగింపు పలకడానికి, పాత వాహనాలను కొనుగోలు చేస్తూ అమాయకంగా మోసపోతున్న సామాన్య ప్రజలను రక్షించడానికి పోలీసులు ప్రత్యేక రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల పోలీసు శాఖ నిర్వహించిన ఆపరేషన్ కవచ్ ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని పలువురు సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారులు కనీస నిబంధనలు, చట్టపరమైన పత్రాలను పరిశీలించకుండానే యథేచ్ఛగా కొనుగోళ్లు, విక్రయాలు సాగిస్తున్నట్లు తేలింది. ఈ తీవ్రమైన ఉల్లంఘనల నేపథ్యంలో పాత వాహనాల దందాను క్రమబద్ధీకరించేందుకు వీలుగా పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు.వాహన అసలు యజమాని యొక్క సరైన వివరాలు, ధృవీకరణ పత్రాలు లేకుండా వాహనాలను కొనుగోలు చేసినా లేదా విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ముఖ్యంగా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వాహనం తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు ఓడోమీటర్ రీడింగ్‌ను మార్చడం, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వాహనాలకు సంబంధించిన తప్పుడు ఫోటోలు, అవాస్తవ సమాచారంతో కూడిన ప్రకటనలు ఇచ్చి మోసం చేసే వ్యాపారస్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లేదా సంస్థ తప్పనిసరిగా సంబంధిత ఆర్టీవో కార్యాలయం నుంచి అధికారిక లైసెన్సు పొంది ఉండాలని ఆయన తేల్చి చెప్పారు.కొనుగోలుదారులు, వ్యాపారులు పాటించాల్సిన ముఖ్య జాగ్రత్తలువ్యాపారులు ఎవరైనా పాత వాహనాన్ని విక్రేత నుంచి తీసుకునే ముందు, సదరు వ్యక్తికి చెందిన ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు పత్రం అంటే ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ మొదలైనవి నకలును తప్పనిసరిగా సేకరించాలి.వాహనం యొక్క రిజిస్ట్రేషన్ కార్డ్ (RC)లో ఉన్న పేరు, చిరునామాను విక్రేత వివరాలతో క్షుణ్ణంగా సరిచూసుకోవాలి.ఒకవేళ అసలు యజమాని కాకుండా బ్రోకర్లు లేదా ఇతరులు వాహనాన్ని విక్రయిస్తుంటే వారికి యజమాని ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ (POA) పత్రాలను నిశితంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది.విక్రేత గుర్తింపు, వాహన యజమాని వివరాలు సంతృప్తికరంగా లేకపోతే ఆ వాహనాన్ని వ్యాపారులు స్టాక్‌లోకి తీసుకోవడం గానీ, ప్రకటనలు ఇవ్వడం గానీ పూర్తిగా నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు.ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ముందస్తు తనిఖీవాహనాన్ని కొనుగోలు చేసే ప్రక్రియకు ముందే అది దొంగిలించబడిందా? పోలీసుల బ్లాక్ లిస్ట్‌లో ఉందా? లేదా గతంలో ఏదైనా రోడ్డు ప్రమాదానికి గురైందా? అనే విషయాలను ముందే నిర్ధారించుకోవాలి.వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలానాలు, రోడ్డు పన్ను బకాయిలు, టోల్‌గేట్ బకాయిలు ఏవీ లేకుండా క్లియరెన్స్ చూసుకోవడం కొనుగోలుదారుల బాధ్యత.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల విక్రయాలకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC) తప్పనిసరిగా ఉండాలి.వాహనాలపై ఉండే ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్ వంటి గుర్తింపు నంబర్లను ట్యాంపరింగ్ చేసినా లేదా అవి స్పష్టంగా లేకపోయినా దాన్ని దొంగిలించిన వాహనంగానే భావించి పోలీసులు తక్షణమే సీజ్ చేస్తారని కమిషనర్ సజ్జనార్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.