: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. ప్రధాన నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి షాకింగ్ ప్రకటన చేసింది. నిరుపేదలకు, దిగువ మధ్యతరగతి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్కీంకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. కింద ఇస్తున్నటువంటి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కుదించింది. అంతకుముందు వరకు ఏడాదికి 9 గ్యాస్ సిలిండర్ల వరకు రాయితీ ఇచ్చేది కేంద్రం. దీనిని ఇప్పుడు 4 సిలిండర్లకే పరిమితం చేసింది. స్కీమ్ ప్రారంభంలో ఇంకా ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇచ్చేవారు. తర్వాత దానిని 9కి తగ్గించగా.. ఇప్పుడు దాంట్లో సగానికి కుదించి నాలుగుకు పరిమితం చేసింది. ప్రస్తుత పశ్చిమాసియా పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని.. కుటుంబ సగటు వినియోగానికి అనుగుణంగానే మార్పులు చేసినట్లు పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్ వెల్లడించారు. అంతకుముందు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ రూ. 200 గా ఉండగా.. 12 సిలిండర్ల వరకు రాయితీ ఇచ్చేదని చెప్పిన ప్రవీణ్.. తర్వాత కేంద్రం గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూ. 300 కు పెంచిందని గుర్తుచేశారు. ఇతర చాలా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎల్‌పీజీ తక్కువగా ఉందని చెప్పిన ఆయన.. ఒక్కో సిలిండర్‌పై ఆయిల్ కంపెనీలు రూ. 700 చొప్పున భారాన్ని భరిస్తున్నాయన్నారు. పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్- డీజిల్ ధరలు..మిడిల్ ఈస్ట్‌లో అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే కొరత సంక్షోభం నెలకొంది. దీంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండగా.. దేశీయంగా చమురు కంపెనీలు ఆ భారాన్ని భరించలేక ఇటీవల వరుసగా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచడం సహా గ్యాస్ సిలిండర్ ధరల్ని కూడా పెంచుతున్నాయి. తొలుత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్నే భారీగా పెంచగా.. . ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 994 కు చేరింది. యుద్ధానికి ముందు ఇది రూ. 905 గా ఉండేది. ఉజ్వల గ్యాస్ యోజన స్కీమ్..ఉజ్వల పథకాన్ని కేంద్రం 2016లో తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులకు తొలుత ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్‌తో పాటుగా మొదటి రీఫిల్, స్టవ్ ఉచితంగానే లభిస్తాయి. ఇప్పుడు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లకు ఒక్కో దానికి రూ. 300 రాయితీ చొప్పున ఏడాదికి రూ. 1200 వరకు సబ్సిడీ వస్తుంది.